Share News

Valmiki Corporation Scam: సిద్ధరామయ్య సర్కార్‌కు ఎదురుదెబ్బ.. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం

ABN , Publish Date - Jul 01 , 2025 | 07:35 PM

గిరిజన సంక్షేమానికి సంబంధించిన కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని, తప్పుడు బ్యాంకు అకౌంట్లలోకి అక్రమంగా కార్పొరేషన్ అకౌంట్లలోని నిధులు బదిలీ చేశారని ఈ కేసులో ప్రధాన ఆరోపణగా ఉంది. షెల్ కంపెనీలకు తరలించిన నిధులను 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బళ్లారి నియోజకవర్గంలో వినియోగించినట్టు ఈడీ చెబుతోంది.

Valmiki Corporation Scam: సిద్ధరామయ్య సర్కార్‌కు ఎదురుదెబ్బ.. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం

బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వాల్మీకి ఎస్టీ డవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం(Valmiki ST Development corporation Scam)లో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) మంగళవారంనాడు ఆదేశించింది. దీంతో ఇంతవరకూ ఈ కుంభకోణానికి సంబంధించిన నిర్దిష్ట అవకతవకలపై దర్యాప్తునకే పరిమితమైన సీబీఐ ఇకనుంచి మొత్తం కేసులో పూర్తి స్థాయి విచారణ చేపడుతుంది.


ఈ కేసులో ఇంతవరకూ జరిగిన విచారణ నివేదకలను సీబీఐకి అప్పగించాలని కూడా హైకోర్టు ఈ సందర్భంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను అదేశించింది. బీజేపీ నేతలు బసనగౌడ పాటిల్ యత్నాల్, అరవింద్ లింబావలి తదితరులు వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎం.నాగప్రసన్న సారథ్యంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. వాల్మీకి స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత జూన్‌లో బళ్లారికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇ.తుకారాం, ముగ్గురు కర్ణాటక ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు జరిపింది.


ఏమిటీ స్కామ్?

గిరిజన సంక్షేమానికి ఉద్దేశించిన కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని, అక్రమంగా కార్పొరేషన్ అకౌంట్లలోని నిధులను తప్పుడు బ్యాంకు అకౌంట్లలోకి బదిలీ చేశారని ఈ కేసులో ప్రధాన ఆరోపణగా ఉంది. షెల్ కంపెనీలకు తరలించిన నిధులను 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బళ్లారి నియోజకవర్గంలో వినియోగించినట్టు ఈడీ చెబుతోంది. రాష్ట్రంలోని ఎస్టీల సామాజిక, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా నిర్దిష్ట సంక్షేమ పథకాల అమలుకు 2006లో కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటయింది. 2024 మే 21న వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో నిధుల దుర్వినియోగం విషయం వెలుగుచూసింది. కార్పొరేషన్ నుంచి అక్రమంగా వివిధ బ్యాంక్ అకౌంట్లకు నిధులు బదిలీ అయినట్టు ఆ అధికారి రాసిన సూసైడ్ నోట్‌ను అధికారులు ఆ తర్వాత కనుగొన్నారు.


ఇవి కూడా చదవండి..

రూ.3 లక్షల కోట్లతో పలు కీలక పథకాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

నో అన్నదే ఆన్సర్.. సీఎం మార్పుపై సూర్జేవాలా

For National News And Telugu News

Updated Date - Jul 01 , 2025 | 07:38 PM