Share News

Union Cabinet: రూ.3 లక్షల కోట్లతో పలు కీలక పథకాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

ABN , Publish Date - Jul 01 , 2025 | 06:03 PM

మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1.07 లక్షల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఇది మ్యాన్యుఫ్యాక్చరింగ్-డ్రైవెన్ ఎకానమీకి కీలక గ్రోత్ ఇంజన్ అని గత బడ్జెట్‌లో వైష్ణవ్ ప్రకటించారు.

Union Cabinet: రూ.3 లక్షల కోట్లతో పలు కీలక పథకాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
Ashwini Vaishnaw

న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ మంగళవారంనాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.3 లక్షల కోట్లకు పైగా విలువచేసే పలు కీలక పథకాలకు ఆమోదం తెలిపింది. వీటిలో ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (ELI), పరిశోదన-అభివృద్ధి-ఆవిష్కరణ (RDI), జాతీయ క్రీడావిధానం 2025, తమిళనాడులో కీలక మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టు ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.


రూ.లక్ష కోట్లతో..

పరిశోధానాభివృద్ధి, ఆవిష్కరణ రంగంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా రీసెర్చ్ డవలప్‌మెంట్ అండ్ ఇన్నొవేషన్ (RDI) పథకానికి కేంద్ర క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనికి రూ.1 లక్ష కోట్లు కేటాయించింది. ఇజ్రాయెల్, యూఎస్, సింగపూర్, జర్మనీ వంటి దేశాల్లో విజయవంతమైన గ్లోబల్ మోడల్స్‌ను అధ్యయనం చేసి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ రూపొందించిన అంతర్జాతీయ రోడ్‌మ్యాప్ ఆధారంగా ఈ స్కీమ్ ఉంటుంది. ప్రైవేటు రంగం నిధుల విషయంలో ఎదుర్కొనే సవాళ్లను అధిగమించేందుకు దీన్ని డిజైన్ చేసినట్టు తెలిపింది. ఈ పథకం కింద ఆర్డీఐలో ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తక్కువ వడ్డీ, వడ్డీరహిత దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ అందించనున్నారు.


ఈఎల్ఐ పథకానికి రూ.1.07 లక్షల కోట్లు

మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1.07 లక్షల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఇది మ్యాన్యుఫ్యాక్చరింగ్-డ్రైవెన్ ఎకానమీకి కీలక గ్రోత్ ఇంజన్ అని గత బడ్జెట్‌లో వైష్ణవ్ ప్రకటించారు.


జాతీయ క్రీడా విధానానికి పచ్చజెండా

గత దశబ్దా కాలంలో భారతదేశం క్రీడారంగంలో సాధిస్తున్న వృద్ధిని దృష్టిలో ఉంచుకుని జాతీయ క్రీడా విధానం-2025కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతిభావంతులైన క్రీడాకారులను అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లడం, కోచింగ్ అవకాశాలు పెరుగుపరచడం, దేశంలోని క్రీడా సదుపాయాలను పటిష్టం చేయడం వంటికి ఈ పథకం ప్రధాన ఉద్దేశాలు.


రూ.1,853 కోట్లతో నాలుగు లేన్ల నేషనల్ హైవే

దక్షిణ భారతదేశంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరచడంలో భాగంగా తమిళనాడులోని పరమకుడి-రామనాథపురం సెక్షన్ల మధ్య నాలుగు లేన్ల నేషనల్ హైవే విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 46.7 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి రూ.1,853 కోట్లు వ్యయం చేయనుంది.


ఇవి కూడా చదవండి..

నో అన్నదే ఆన్సర్.. సీఎం మార్పుపై సూర్జేవాలా

ట్రంప్ మాటలు సరికాదు.. అప్పుడు మోదీతో నేనూ ఉన్నాను

For National News And Telugu News

Updated Date - Jul 01 , 2025 | 06:10 PM