Share News

Kamal Haasan Vijay Rally: విజయ్ ర్యాలీకి వచ్చిన జనాల గురించి కమల్ హాసన్ కామెంట్స్

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:35 PM

ఇటీవల తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ర్యాలీలకు వస్తున్న జనసంద్రాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ, ఆ జనం అంతా ఓటర్లుగా మారతారా? ఇదే ప్రశ్నకు తాజాగా కమల్ హాసన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

Kamal Haasan Vijay Rally: విజయ్ ర్యాలీకి వచ్చిన జనాల గురించి కమల్ హాసన్ కామెంట్స్
Kamal Haasan Vijay Rally

చెన్నై: మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ (Kamal Haasan) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుడు ఎంత పెద్ద జనసమీకరణ చేసినా, ఆ జనం అంతా ఓట్లుగా మారరని అన్నారు. ఈ విషయం తనకూ, ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్‌కి కూడా వర్తిస్తుందన్నారు. విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ర్యాలీల్లో కనిపిస్తున్న భారీ జనం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు కమల్ ఈ సమాధానం చెప్పారు.

మళ్లీ విజయ్ గురించి అని ప్రత్యేకంగా అడిగితే అందరికీ వర్తిస్తే విజయ్‌ని ఎలా మినహాయించగలమని కమల్ అన్నారు. భారతదేశంలోని అందరు నాయకులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. జనాలను ఆకర్షించడం వేరు, ఆ జనం ఓట్లుగా మారడం (Vijay Rally) వేరని కమల్ తనదైన శైలిలో స్పష్టం చేశారు.


కమల్ సూచన

విజయ్‌కి రాజకీయాల్లో ఎలాంటి సలహా ఇస్తారని అడిగితే, కమల్ చాలా సింపుల్‌గా సమాధానమిచ్చారు. సరైన మార్గంలో నడవండి, ధైర్యంగా ముందుకు సాగండి, ప్రజలకు మంచి చేయాలని సూచించారు. ఇది నా సలహా. ఇది అందరి నాయకులకూ వర్తిస్తుందన్నారు. రాజకీయాల్లోనే కాదు, సినిమా రంగంలోనూ విమర్శలు సర్వసాధారణమని, కొత్తగా వచ్చే నటులను కూడా చాలామంది విమర్శిస్తారని కమల్ గుర్తు చేశారు.


విజయ్ ఇప్పటికే

ఇదిలా ఉంటే విజయ్ ర్యాలీలపై డీఎంకే పార్టీ నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. విజయ్ ర్యాలీల్లో కనిపిస్తున్న జనం ఓట్లుగా మారరని అంటున్నారు. ఈ విమర్శలకు విజయ్ తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చారు. సెప్టెంబర్ 20న తిరువారూర్‌లో జరిగిన ర్యాలీలో విజయ్ జనాలను ఉద్దేశించి, ఈ గుండెలు ఖాళీగా ఉన్నాయా? ఈ జనం ఓట్లు వేయరా? అని అడిగారు.

దానికి జనం గట్టిగా విజయ్ అంటూ అరుపులు చేశారు. ఈ సందడి చూస్తే జనం TVKకి ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నట్టే కనిపిస్తోంది. విజయ్ ఈ సందర్భంగా జనాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. TVK లక్ష్యం నిజమైన ప్రజాస్వామ్యంతో కూడిన పాలనను తీసుకురావడమేనని పేర్కొన్నారు.


ఒక సవాల్

రాజకీయాల్లో జనాలను ఆకర్షించడం ఒక ఎత్తైతే, వాళ్లను ఓట్లుగా మార్చడం మరో ఎత్తు. కమల్ అన్నట్టు, ఈ రూల్ అందరికీ వర్తిస్తుంది. విజయ్ ఈ ఛాలెంజ్‌ని ఎలా అధిగమిస్తాడో చూడాలి మరి. రాజకీయాల్లో కొత్తగా అడుగుపెడుతున్న విజయ్‌కి ఇది ఒక పెద్ద పరీక్షే. దీనిపై మీరు ఏం అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 03:20 PM