Share News

Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి ఎవరో తెలుసా..?

ABN , Publish Date - Aug 19 , 2025 | 01:24 PM

జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి 1969లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2005లో సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి ఎవరో తెలుసా..?
Justice B Sudarshan Reddy

ఢిల్లీ: జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి భారత ప్రఖ్యాత న్యాయమూర్తులలో ఒకరు. ఆయన 1948లో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించారు. ఆయన 1969లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2005లో సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2011లో పదవీ విరమణ పొందారు. తదుపరి 2013 మార్చిలో మొదటి గోవా లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ పదవికి కూడా 2013 అక్టోబర్‌లో వ్యక్తిగత కారణాలతో పదవీకి రాజీనామా చేశారు. ఆయన న్యాయపరమైన అంశాలలో న్యాయవ్యవస్థలో చెరిగిపోని ముద్ర వేశారు. పదవీ విరమణ అనంతరం కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఆయన సేవలు కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ఆయనను ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆయన మళ్లి వార్తల్లో నిలిచారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

విద్యుత్‌ షాక్‌తో తండ్రీకొడుకుల మృతి

ఎమ్మెల్సీ కవిత ఒంటరేనా!?

Updated Date - Aug 19 , 2025 | 01:41 PM