Indigo Flight: ఎగురలేక రన్‌వేపై ఆగిపోయిన విమానం.. ప్రయాణికుల్లో డింపుల్ యాదవ్
ABN , Publish Date - Sep 14 , 2025 | 02:42 PM
ఢిల్లీకి వెళ్లే 6E 2111 విమానం రన్‌వేపై వేగం పుంజుకునే సమయంలో గాల్లోకి ఎగరలేకపోయింది. దీంతో పైలట్ రన్‌వే ముగిసేలోగా విమానాన్ని ఆపేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకూ ఇండిగో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో (Lucknow) విమానాశ్రయంలో ఆదివారం నాడు ఊహించని ఘటన చోటుచేసుకుంది. లక్నో నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానంలో టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం పైకి ఎగురలేక రన్‌వే పైనే ఆగిపోయింది. దీంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి టేకాఫ్‌ను నిలిపివేశారు. ఆ సమయంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ (Dimple Yadav) సహా 151 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. టేకాఫ్ నిలిపివేసిన అనంతరం ప్రయాణికులను కిందకు దించి వేరే విమానంలో ఢిల్లీకి పంపారు.
ఢిల్లీకి వెళ్లే 6E 2111 విమానం రన్‌వేపై వేగం పుంజుకునే సమయంలో గాల్లోకి ఎగరలేకపోయింది. దీంతో పైలట్ రన్‌వే ముగిసేలోగా విమానాన్ని ఆపేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకూ ఇండిగో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మరోవైపు ఈనెల 6న సైతం ఇలాంటి ఘటనే ఇండిగో విమానానికి ఎదురైంది. అబూదబి వెళ్లాల్సిన ఇండిగో విమానం టెకాఫ్ అయిన కొద్ది సేపట్లోనే సాంకేతిక లోపం తలెత్తడంతో కొచ్చి విమానాశ్రయానికి తిరిగి వచ్చింది.
ఇవి కూడా చదవండి..
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
243 సీట్లలో పోటీ చేస్తాం..బీహార్‌లో గేమ్ ఛేంజర్ ప్లాన్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి