India's Infant Mortality Rate: దేశంలో భారీగా తగ్గిన శిశు మరణాలు.. స్పందించిన కేంద్రం
ABN , Publish Date - Sep 04 , 2025 | 05:31 PM
భారత్‌లో శిశువుల మరణాల రేటు భారీగా తగ్గింది. అది కూడా రికార్డు స్థాయిలో 25 శాతానికి తగ్గింది. 2013లో ఈ శిశు మరణాలు 40 శాతంగా ఉండేది. అంటే 40 నుంచి 37.5 శాతానికి శిశు మరణాలు తగ్గింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 04: భారత్‌లో శిశువుల మరణాల రేటు భారీగా తగ్గింది. అది కూడా రికార్డు స్థాయిలో అంటే.. 25 శాతానికి తగ్గింది. అయితే 2013లో ఈ శిశు మరణాల రేటు 40 శాతంగా ఉండేది. అంటే 40 నుంచి 37.5 శాతానికి ఈ శిశు మరణాలు రేటు తగ్గింది. ఈ మేరకు సంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) 2023 నివేదికను రిజిస్ట్రర్ జనరల్ ఆఫ్ ఇండియా గురువారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో అత్యధికంగా 37 శాతం శిశు మరణాల రేటు నమోదు కాగా.. మణిపూర్‌లో అత్యల్పంగా 3 శాతంగా ఈ రేటు ఉందని వివరించింది. ఆ తర్వాత స్థానాన్ని కేరళ అక్రమించిందని పేర్కొంది. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఈ శిశు మరణాల రేటు 44 నుంచి 28కి తగ్గిందని.. అదే విధంగా పట్టణ ప్రాంతంలో ఇది 27 నుంచి 18కి పడిపోయిందని సోదాహరణగా తెలిపింది. అంటే దశాబ్దంలో ఇది 36 నుంచి 33 శాతానికి చేరుకుందని చెప్పింది.
ఇక దేశంలో దశాబ్దాలుగా చోటు చేసుకున్న జనన, మరణాలలో స్థిరమైన తగ్గుదలను ఈ నివేదిక బహిర్గతం చేసింది. భారత్‌లో జననాల రేటు ఈ ఐదు దశాబ్దాల్లో సగానికి తగ్గిందంది. అంటే 1971లో 36.9 నుంచి 2023లో 18.4కి పడిపోయిందని తెలిపింది. అలాగే గత దశాబ్దంలోనే ఇది 14 శాతానికి తగ్గిందని తెలిపింది. 2013లో 21.4 నుంచి 2023లో18.4కి.. గ్రామీణ ప్రాంతాల్లో 22.9 నుంచి 20.3కి తగ్గాయని...అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో 17.3 నుంచి 14.9కి తగ్గాయని ఈ నివేదికలో స్పష్టం చేసింది. అయితే బిహార్‌లో అత్యధిక జననాల రేటు అంటే 25.8 ఉండగా.. అండమాన్ నికోబార్ దీవుల్లో 10.1తో అత్యల్పంగా ఉందంది.
మరణాల రేటు సైతం తగ్గింది. 1971లో 14.9 నుంచి 2023లో 6.4కి తగ్గిందని తెలిపింది. గ్రామీణ ప్రాంతాలు 2022లో 7.2 నుంచి 2023లో 6.8కి తగ్గాయని చెప్పింది. అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో 6.0 నుంచి 5.7కి పడిపోయాయని వివరించింది. ఛండీగఢ్‌లో అత్యల్ప మరణాల రేటు 4గా.. ఛత్తీస్‌గఢ్‌లో అత్యధికంగా 8.3గా నమోదు అయిందని గణాంకాలతో సహా చెప్పింది. ఈ వివరాలపై కేంద్ర ప్రభుత్వం గురువారం స్పందించింది. దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ, జనాభా నియంత్రణతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలకు అందుతున్న ఆరోగ్య సంరక్షణను ఈ వివరాలు ప్రతిబింబిస్తున్నాయని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
వరద సంక్షోభానికి కారణం అక్రమ చెట్ల నరికివేతే.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
Read Latest National News News and Telugu News