Share News

Missile Strikes on Pak Air Bases: పాక్ మిలిటరీ స్థావరాలపై భారత్ వైమానిక దాడులు.. షాకింగ్ పిక్చర్స్

ABN , Publish Date - May 11 , 2025 | 10:20 PM

భారత్ జరిపిన మిసైల్ దాడుల్లో పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసమైన ఘటనల తాలూకు శాటిలైట్ చిత్రాలను నిపుణులు నెట్టింట పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి.

Missile Strikes on Pak Air Bases: పాక్ మిలిటరీ స్థావరాలపై భారత్ వైమానిక దాడులు.. షాకింగ్ పిక్చర్స్
Indian cruise missile strikes

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడి తరువాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయిన విషయం తెలిసిందే. పౌర నివాసాలను పాక్ టార్గెట్ చేసుకోవడంతో భారత్ దీటుగా జవాబిచ్చింది. పాక్ వైమానిక స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో మిసైల్ దాడులు చేసింది. దీంతో, పాక్ మిలిటరీ మౌలిక వసతులు భారీ స్థాయిలో ధ్వంసమయ్యాయి. బాధ్యతాయుత వైఖరి అవలంబించిన భారత్.. పాక్‌లోని రాడార్ వ్యవస్థలు, కంమాండ్ కంట్రోల్ సెంటర్లు, మందుగుండు సామగ్రి నిల్వచేసిన డిపాట్స్‌ను టార్గెట్ చేసుకుంది. రఫీకీ, చక్లాలా, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్, సియాల్‌కోట్ ప్రాంతాల్లోని మిలిటరీ స్థావరాలపై భారత్ అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసింది.


ఈ నేపథ్యంలో దాడులకు ముందు ఆ తరువాత అక్కడి మిలిటరీ స్థావరాల పరిస్థితి ఎలా ఉందో చెప్పే శాటిలైట్ ఫొటోలను కొన్ని ప్రైవేటు సంస్థలు నెట్టింట పంచుకున్నాయి. కావా స్పేస్‌తో పాటు ఓఎన్ఐఎస్‌టీ నిపుణులు ఈ ఫొటోలను నెట్టింట షేర్ చేశారు. వీటితో పాటు చైనా శాటిలైట్ సంస్థ మీజావిజన్ కూడా శాటిలైట్ చిత్రాలను పంచుకుంది. నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌కు జరిగిన నష్టాన్ని ఈ చిత్రాల్లో స్పష్టంగా కనిపించింది. ఇతర ఎయిర్‌బేస్‌ల చిత్రాలను ఓఎన్ఐఎస్‌టీ పంచుకుంది. భారత్ దాడుల్లో పాక్ స్థావరాలకు భారీ నష్టం జరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఓ వైమానిక స్థావరంలో హ్యాంగర్ ధ్వంసం అయినట్టు ఈ చిత్రాల్లో కనిపించింది. మరో బేస్‌లో రన్‌వే ధ్వంసమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ కూడా పాక్షికంగా ధ్వంసమైనట్టు చిత్రాల్లో స్పష్టంగా కనిపించింది.


ఉగ్రవాద చర్యలను యుద్ధ చర్యలుగా పరిగణిస్తామని భారత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగూణంగానే భారత్ మునుపెన్నడూ లేని విధంగా పాక్ భూభాగంలోని పలు ఎయిర్‌బేస్‌లను టార్గెట్ చేసింది. అత్యంత కచ్చితత్వంతో ఈ లక్ష్యాలను ధ్వంసం చేసింది. దీంతో, ఈ చిత్రాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఈ చిత్రాలను పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

కృష్ణబిలంలో పడి నక్షత్రం ధ్వంసం.. అద్భుత ఫొటో షేర్ చేసిన నాసా

ఈ విషయాల్లో ప్రపంచానికంటే భారత్ బెటరంటున్న అమెరికా మహిళ

భారతీయులు కాస్తంత మర్యాదగా నడుచుకుంటే మంచిదంటున్న కెనడా పౌరుడు

వాన పడుతోందని వర్క్ ఫ్రమ్ హోం అడిగిన ఉద్యోగి.. చివరకు జరిగిందంటే..

మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..

Read Latest and Viral New

Updated Date - May 11 , 2025 | 11:35 PM