Operation Sindoor: డమ్మీ ఎయిర్‌క్రాఫ్ట్ ఎరగా వేసి.. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ ప్లాన్ ఇదే..
ABN , Publish Date - May 17 , 2025 | 04:18 PM
Operation Sindoor Dummy Aircraft: పహల్గాం ఉగ్రదాడి తర్వాత 'ఆపరేషన్ సిందూర్' ద్వారా పాక్ ఉగ్రమూకలకు దిమ్మతిరిగే షాకిచ్చింది భారత్. ఈ చర్యతో రగిలిపోయిన దాయాది దేశం చైనా, తుర్కియే, అజర్‌బైజాన్ అండ చూసుకుని ఓ వ్యూహం పన్నింది. అయితే, మన భారత వాయుసేనలు రివర్స్ అటాక్ చేసి పాకిస్థాన్‌ను ఫూల్ చేశాయి. డమ్మీ ఎయిర్‌క్రాఫ్ట్ ఎరగా వేసి దుష్ట పాక్‌ను ఎలా దెబ్బతీశాయంటే..
India Dummy Aircraft Operation: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా పాకిస్థాన్(Pakistan), పాక్ ఆక్రమిత కశ్మీర్(Pok)లోని ఉగ్రవాద స్థావరాలను నామరూపాల్లేకుండా చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత సైన్యం అనుసరించిన వ్యూహాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. మే 9-10 మధ్య వాయుసేనలు నిర్వహించిన ఆపరేషన్ గురించిన కీలక ప్లాన్ తాజాగా వెలుగులోకి వచ్చింది. చైనా అండతో ఇండియాపై దాడికి స్కెచ్ వేసిన దుష్ట పాక్ ను దాదాపు అలాంటి ప్లానే వేసి బోల్తా కొట్టించింది భారత్. మే 10న తెల్లవారుజామున ఐఏఎఫ్ సుఖోయ్-30, మిగ్-29 వంటి యుద్ధ విమానాల మాదిరిగా కనిపించే మానవరహిత డ్రోన్లను (UAV) పాక్ కు ఎరగా వేసింది. చైనా గగనతల రక్షణ వ్యవస్థ సాయంతో ఇండియాను దెబ్బతీయాలని భావించిన పాక్ సేనలను ఫూల్ చేసింది.
చైనా వైమానిక రక్షణ వ్యవస్థల ద్వారా భారత్‌ను దెబ్బతీయాలని పన్నాగం పన్నిన పాక్ సేనలను తెలివిగా ఉచ్చులో బిగించింది భారత వైమానిక దళం (IAF). పాక్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని 12 ముఖ్యమైన వైమానిక దళ స్థావరాలలో 11 స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. అంతకు ముందే, ఫైటర్ జెట్లను పోలి ఉండే మానవరహిత డ్రోన్లను పాక్ గగనతలంలోకి ప్రవేశపెట్టింది. అది చూసి ఇండియా వైమానిక దాడులకు దిగుతోందని భ్రమపడ్డాయి దాయాది సేనలు. వెంటనే చైనా తయారుచేసిన హెచ్‌క్యూ-9 క్షిపణి వ్యవస్థలను వరసబెట్టి యాక్టివేట్ చేశాయి. అంతే.. ఆ క్షణంలోనే హెచ్‌క్యూ-9 జాడలను ఇట్టే పసిగట్టేసి జామ్ చేసేసింది ఎయిర్‌ఫోర్స్.
దీని తరువాత భారత వైమానిక దళం నిజమైన దాడిని ప్రారంభించింది. దాదాపు 15 బ్రహ్మోస్ క్షిపణులు, స్కాల్ప్, రాంపేజ్, క్రిస్టల్ మేజ్ వంటి దీర్ఘ-శ్రేణి క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో పాకిస్థాన్‌లోని 11 కీలక వైమానిక స్థావరాలు సర్వనాశనమయ్యాయి. ఇంకా ఎయిర్‌బేస్‌ల్లోని రాడార్లు, వైమానిక స్థావరాలు, వైమానిక దళం ఎయిర్‌స్ట్రిప్‌లు, హ్యాంగర్లు, రన్ వేలు, సింధ్‌లో మోహరించిన డ్రోన్ యూనిట్లు, కమ్యూనికేషన్ సహా అనేక కీలక వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఈ యుద్ధంలోనే తొలిసారిగా బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను ఉపయోగించింది భారత్. ఈ పరిణామం తర్వాత దాయాది దేశానికి గగనతల దాడులకు పాల్పడే దారి లేకపోయింది. దిక్కుతోచని పరిస్థితిలో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుందామంటూ కాళ్లబేరానికి వచ్చింది. పాక్ డీజీఎంవో హఠాత్తుగా సీజ్ ఫైర్ ప్రతిపాదన తీసుకురావడానికి ఈ దాడే కారణమని భారత వైమానిక అధికారులు ఓ జాతీయా మీడియాతో వెల్లడించారు.
Read Also: Operation Sindoor: మానవళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
Heli-Ambulance Crash Lands: కేదార్‌నాథ్‌లో హెలీ అంబులెన్స్ క్రాష్ ల్యాండింగ్.. ప్యాసెంజర్స్ సేఫ్
Gensol Engineerings: ధోనీ, దీపికా పెట్టుబడిపెట్టిన జెన్సోల్ కొత్త CFO కూడా రాజీనామా