Heli-Ambulance Crash Lands: కేదార్‌నాథ్‌లో హెలీ అంబులెన్స్ క్రాష్ ల్యాండింగ్.. ప్యాసెంజర్స్ సేఫ్
ABN , Publish Date - May 17 , 2025 | 04:41 PM
కేదార్‌నాథ్‌లో ఎయిమ్స్‌కు చెందిన ఓ హెలీ అంబులెన్స్ క్రాష్ ల్యాండ్ అయ్యింది. అయితే, ప్రయాణికులకు ఎలాంటి అపాయం కలుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో రిషీకేశ్ ఎయిమ్స్‌కు చెందిన ఓ హెలికాఫ్టర్ అంబులెన్స్ శనివారం క్రాష్ ల్యాండయ్యింది. అయితే, ఈ ఘటనలో హెలికాఫ్టర్‌లోని వారందరూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన సమయంలో హెలికాఫ్టర్‌లో పైలట్‌తో పాటు ఓ డాక్టర్, మరో వైద్య సిబ్బంది ఉన్నారు.
ల్యాండింగ్ సమయంలో హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తి వెనక భాగం కొద్దిగా దెబ్బతిందని ఎయిమ్స్ సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తెలిపారు. ఈ సందర్భంలోనే క్రాష్ ల్యాండ్ కావాల్సి వచ్చిందని అన్నారు. కాగా, హెలికాఫ్టర్‌లోని వారందరూ క్షేమంగా ఉన్నారని గర్వాల్ జిల్లా కమిషనర్ తెలిపారు. ల్యాండింగ్ సమయంలో హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని చెప్పారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ముప్పును తప్పించారని చెప్పారు.
కాగా మే 8న మరో హెలికాఫ్టర్ కూలిన ఘటనలో ఆరుగురు మరణించగా ఒకరు గాయాలపాలయ్యారు. ఉత్తరకాశీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గంగోత్రికి సమీపంలో ఈ హెలికాప్టర్ క్రాష్ అయ్యింది.
ఇవి కూడా చదవండి:
ధోనీ, దీపికా పెట్టుబడిపెట్టిన జెన్సోల్ కొత్త CFO కూడా రాజీనామా
పాకిస్థాన్‌కు సమాచారం.. మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా ఆరుగురు అరెస్టు
బిన్ లాడెన్‌ను హతమార్చిన ఘటనతో ఆపరేషన్ సిందూర్‌కు పోలిక