Zubeen Garg Case: జుబీన్ గార్గ్ మరణంపై దర్యాప్తు.. 3,500 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:16 PM
అస్సాం సాంస్కృతిక ఐకాన్, ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ జుబీన్ గార్గ్ ఇటీవల సింగపూర్ లో కన్నుమూశారు. ఓ ఈవెంట్ లో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లినప్పుడు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే..
ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ సింగపూర్‌లో సెప్టెంబర్ 19న మరణించారు. 4వ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌లో పాల్గొనడానికి వెళ్లిన ఆయన అనుమానాస్పదంగా మృతి చెందారు. దీనిపై ఆయన ఫ్యాన్స్ పెద్దఎత్తున ఆందోళన చేయడంతో అస్సాం ప్రభుత్వం CIDకి చెందిన స్పెషల్ DGP మున్నా ప్రసాద్ గుప్తా నేతృత్వంలో 9 మంది అధికారులతో SITని ఏర్పాటు చేసింది. శుక్రవారం గౌహతిలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు వివరణాత్మక ఛార్జిషీట్‌ను SIT సమర్పించింది. 3,500 పేజీలకు పైగా ఉన్న ఈ పత్రాన్ని శుక్రవారం నాలుగు పెద్ద ట్రంక్‌లలో కోర్టుకు తీసుకువచ్చారు.
ప్రస్తుతం ఈ దర్యాప్తు స్పెషల్ డీజీపీ ఎంపీ గుప్తా ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ కేసు గురించి ఆయన మాట్లాడుతూ.. ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్‌కను మహంతతో సహా ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు. వీరంతా జడ్యూషియల్ కస్టడీలో ఉన్నారు. దర్యాప్తు సమయంలో 300 మందికి పైగా సాక్షులను ప్రశ్నించామని తెలిపారు. కాగా, 2025 సెప్టెంబర్ 19న జుబీన్ గార్గ్ (52) నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ (NEIF)లో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లారు. కానీ.. అనూహ్యంగా మరణించారు. సెయింట్ జాన్స్ ఐలాండ్ వద్ద స్కూబా డైవింగ్ చేస్తున్నప్పడు ఈ దుర్ఘటన జరిగిందని అనుకున్నా.. తర్వాత ఇది సముద్రంలో ఈత కొడుతున్నప్పుడు జరిగిన మరణంగా నిర్ధారణ అయింది.
మొదటి స్విమ్ తర్వాత లైఫ్ జాకెట్ ధరించకుండా రెండోసారి ఈతకు వెళ్లినప్పుడు సీజర్ (ఎపిలెప్సీ దాడి)కు గురై చనిపోయినట్లు తెలిపారు. పోలీసులు ఆయన్ని జనరల్ హాస్పిటల్ తరలించారు.. అక్కడే ఆయన మృతి చెందారు. ఇదిలా ఉంటే.. ఎంతో ఆరోగ్యంగా ఉండే జుబిన్ గార్గ్ అలా ఎలా చనిపోతాడని ఆయన ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. అస్సాంలో 60కి పైగా FIRలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా సర్మా తొమ్మిది మందితో సిట్ ఏర్పాటు చేశారు. కాగా, దీనిపై సిట్ తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Union Cabinet Key Decisions: కేంద్ర కేబినెట్ భేటీ.. సంచలన నిర్ణయాలివే..
Cognizant In Visakhapatnam: విశాఖ కాగ్నిజెంట్‌లో 25 వేల మందికి ఉద్యోగాలు: సీఈవో రవి కుమార్