Red Alert For Delhi: ఢిల్లీలో రెడ్ అలర్ట్...ఉరుములు మెరుపులతో వర్షాలు
ABN , Publish Date - Aug 23 , 2025 | 08:06 PM
ఢిల్లీ, పరిసర ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, భారీ వర్షాలకు, రాకపోకలపై తీవ్ర ప్రభావం ఉంటే అవకాశం ఉన్నందున ప్రజలు లోతత్తు ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు.
న్యూఢిల్లీ: భారత వాతావరణ శాఖ శనివారం సాయంత్రం ఢిల్లీలో మూడు గంటల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షాలు పడవచ్చని ఢిల్లీ వాసులను ఐఎండీ హెచ్చరించింది. సాయంత్రం 5.11 గంటల నుంచి రాత్రి 8.11 గంటల వరకూ ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయి.
ఢిల్లీ, పరిసర ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, భారీ వర్షాలకు రాకపోకలపై తీవ్ర ప్రభావం ఉంటే అవకాశం ఉన్నందున ప్రజలు లోతట్టు ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు. సివిల్ లైన్స్, రెడ్ ఫోర్ట్, లజ్‌పట్ నగర్, నరేల, బావన, అలిపూర్ ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది.
శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు ఎన్‌సీఆర్‌లోని నొయిడాలో భారీ వర్షపాతం నమోదు కావడం, పలు చోట్ల జలదిగ్బంధాలు, ట్రాఫిక్ జామ్‌లు చోటుచేసుకున్నాయి. ఆదివారంనాడు కూడా ఉరుములు మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాల పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నార్త్, సెంట్రల్, సౌత్, సౌత్‌ఈస్ట్ ఢిల్లీలో పలుచోట్ల వర్షపాతం నమోదు కావడం, సుమారు 10 ఫిర్యాదులు ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌కు వచ్చాయి. గంటలోపే పరిస్థితిని చక్కదిద్దినట్టు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కుప్పకూలిన జైపూర్ చారిత్రక అమెర్ ఫోర్ట్ గోడ
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News