Jaipur Amer Fort Wall Collapsed: కుప్పకూలిన జైపూర్ చారిత్రక అమెర్ ఫోర్ట్ గోడ
ABN , Publish Date - Aug 23 , 2025 | 07:01 PM
రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెగని వర్షాలు కురుస్తుండంతో సామాన్య ప్రజాజీవనానికి అంతరాయం కలుగుతోంది. కోట, బుండి, సవాయ్ మాధోపూర్, టోంక్‌లలో వరదల తరహా పరిస్థితి కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రోడ్డు, రైల్ కనెక్టివిటీ దెబ్బతింది.
జైపూర్: భారీ వర్షాలు రాజస్థాన్‌ను కుదిపేస్తున్నారు. శనివారంనాడు భారీ వర్షం కారణంగా జైపూర్‌లోని చారిత్రక అమెర్ ఫోర్ట్ (Amer Fort)కు చెందిన 200 అడుగుల పొడవైన గోడ కుప్పకూలింది. ఈ గోడలోని ప్రధాన భాగం వర్షాలకు కొట్టుకుపోయిన వీడియోను ఒక ప్రముఖ వార్తా సంస్థ షేర్ చేసింది.
రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెగని వర్షాలు కురుస్తుండంతో సామాన్య ప్రజాజీవనానికి అంతరాయం కలుగుతోంది. కోట, బుండి, సవాయ్ మాధోపూర్, టోంక్‌లలో వరదల తరహా పరిస్థితి కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రోడ్డు, రైల్ కనెక్టివిటీ దెబ్బతింది.
కాగా, బుండి, కోట, సవాయ్ మాధోపూర్, కరౌలి, జైపూర్‌లలో శనివారం ఉదయం 10 సెంటమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ జలదిగ్బంధం కొనసాగుతోంది. భిల్వారా, చిత్తోర్‌గఢ్‌లలో భారీ వర్షపాతం నమోదు కావడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. బుండి, కోట, పాలి, రాజ్‌సమద్, ఉదయ్‌పూర్, డంగార్‌పూర్, బన్స్వారా, జలోర్, సిరోహిలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News