Hanuman First Astronaut: తొలి వ్యోమగామి హనుమంతుడు.. విద్యార్థులతో అనురాగ్ ఠాకూర్
ABN , Publish Date - Aug 24 , 2025 | 07:46 PM
హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనాలోని ఓ స్కూలులో నేషనల్ స్పేస్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హమీర్‌పూర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి అంతరిక్షంలోకి తొలిసారి వెళ్లినదెవరు? అని ప్రశ్నించారు.
ఉనా: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రికార్డు సృష్టించారు. మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి ఆక్సియం మిషన్-4లో భాగంగా 20 రోజుల అంతరిక్ష పర్యటన చేసి ఇటీవల తిరిగొచ్చారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా 'నేషనల్ స్పేష్ డే' మరోసారి సాహసిక వ్యోమగాములను గుర్తు చేసుకుంటోంది. ఈ క్రమంలో అంతరిక్షానికి వెళ్లిన తొలివ్యక్తిగా ఎవరిని పరిగణించవచ్చు అంటూ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసక్తికరమైన ప్రశ్నను విద్యార్థులపై సంధించారు. తిరిగి ఆయనే 'పహనసుత హనుమాన్... తొలి వ్యోమగామి' అని సమాధానం చెప్పారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనాలోని ఓ స్కూలులో 'నేషనల్ స్పేస్ డే' సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హమీర్‌పూర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి 'అంతరిక్షంలోకి తొలిసారి వెళ్లినదెవరు?' అని ప్రశ్నించారు. కొద్ది సేపు ఆగి... 'హనుమంతుడని నేను అనుకుంటున్నాను' అని నవ్వుతూ సమాధానమిచ్చారు.
కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా భారతదేశ సంప్రదాయాలతో అనుసంధానం కావాలని విద్యార్థులకు అనురాగ్ ఠాకూర్ సూచించారు. వేలాది సంవత్సరాల క్రితం నాటి మన సంప్రదాయాలు, జ్ఞానసంపద, సంస్కృతిని తెలుసుకోవాలన్నారు. అప్పుడే ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతారని అన్నారు. హనుమంతుడు పుట్టగానే ఆకలి వేసి... ఆకాశంలోని సూర్యుడిని చూసి పండుగా భావించి మింగేందుకు అంతరిక్షంలోకి దూసుకువెళ్లినట్టు మన పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News