Bihar: బిహార్ ఓటర్ల జాబితాలో ఇద్దరు పాకిస్థానీలు
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:18 PM
హోం మంత్రిత్వ శాఖ విచారణ ప్రకారం, ఇమ్రానా ఖానమ్ అలియాస్ ఇమ్రానా ఖాటూన్, ఫిర్దోషియా ఖానమ్‌లకు ఓటర్ కార్డులు జారీ అయ్యాయి. ఫిర్దోషియా 1956లో మూడు నెలల వీసాపై, ఇమ్రాన్ మూడేళ్ల వీసాపై భారత్‌కు వచ్చారు.
పాట్నా: బిహార్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ విపక్షాలు తీవ్ర విమర్శల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో ఇద్దరు పాకిస్థానీ మహిళలకు ఓటరు కార్డులు జారీ అయినట్టు తాజాగా వెలుగుచూసింది. ఇమ్రానా ఖానమ్ అలియాస్ ఇమ్రానా ఖాటూన్, ఫిర్దోషియా ఖానమ్ అనే ఇద్దరు మహిళలకు ఇటీవల ఓటర్ కార్డులు జారీ అయ్యాయి. దీనిపై కేంద్ర హోం చర్యలకు దిగింది. వారి పేర్లను వెంటనే తొలగించాలని యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై జిల్లా మెజిస్ట్రేట్ వెంటనే తక్షణ ఆదేశాలు ఇవ్వడంతో ఓటర్ల జాబితా నుంచి ఇద్దరు పాకిస్థానీ మహిళల పేర్లు తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది.
'నిర్దిష్ట సమాచారం మేరకు ఓటర్ల జాబితాలో ఇద్దరు పాక్ మహిళల పేర్లు కనిపించాయి. వెరిఫికేషన్ తర్వాత ఫామ్-7ను పూర్తి చేసి వారి పేర్లు తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. హోం మంత్రిత్వ శాఖ నుంచి మాకు ఈ మేరకు ఆదేశాలు వచ్చాయి' అని భాగల్పూర్ డీఎం డాక్టర్ నావల్ కిషోర్ చౌదరి తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు ఆయన వెల్లడించలేదు.
హోం మంత్రిత్వ శాఖ విచారణ ప్రకారం, ఇమ్రానా ఖానమ్ అలియాస్ ఇమ్రానా ఖాటూన్, ఫిర్దోషియా ఖానమ్‌లకు ఓటర్ కార్డులు జారీ అయ్యాయి. ఫిర్దోషియా 1956లో మూడు నెలల వీసాపై, ఇమ్రాన్ మూడేళ్ల వీసాపై భారత్‌కు వచ్చారు. భాగల్పూరు జిల్లాలోని భికన్‌పూర్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఈ ఇద్దరు మహిళలు వయోవృద్ధులు కావడంతో సరైన సమాచారం కూడా ఇవ్వలేకుండా ఉన్నారని తెలుస్తోంది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాలని హోం శాఖ ఆదేశాలతో విచారణ ప్రారంభించి, నోటీసులు పంపినట్టు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఓట్ల చోరీ జరగనీయం.. ఈసీని వదలం
రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన సిబ్బంది
For More National News And Telugu News