Earthquake In Gujarat: భూ ప్రకంపనలు.. భయంతో ఇళ్ల నుంచి జనం పరుగు
ABN , Publish Date - Dec 26 , 2025 | 09:48 AM
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూ ప్రకంపనల తీవ్రత 4.4గా గుర్తించినట్లు తెలిపింది.
గాంధీనగర్, డిసెంబర్ 26: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రకంపనలు వచ్చాయి. ఈ భూ ప్రకంపనల తీవ్రత రిక్టర స్కేలుపై 4.4 గా నమోదు అయింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూ ప్రకంపల కేంద్రాన్ని గుర్తించినట్లు వివరించింది. 23.65 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్, 70.23 ఈస్ట్ లాంగిట్యూడ్ మధ్య 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. ఈ భూ ప్రకంపనలు సంభవించిన వెంటనే ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకపంనల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని ఉన్నతాధికారులు వివరించారు.
మరోవైపు ఈ కచ్ జిల్లాలో తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. కానీ స్వల్ప భూ ప్రకంపనలతో ఇక్కడ భూకంపాలు సంభవిస్తున్నాయి. 2001లో గుజరాత్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది గాయపడ్డారు. ఈ వరుస భూప్రకంపనల కారణంగా.. స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన రైల్వే చార్జీలు.. నేటి నుంచి అమలు
కడుపులో అల్సర్లు తగ్గించే జ్యూస్..
For More National News And Telugu News