Bihar Train Accident: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు దుర్మరణం
ABN , Publish Date - Oct 03 , 2025 | 02:33 PM
పట్టాలు దాటుతున్న యువకులను హైస్పీడు రైలు ఢీకొట్టినట్టు స్థానికుల సమాచారం. రైల్వే క్రాసింగ్ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? రైలు వేగంగా వస్తున్న విషయం తెలిసినా పట్టాలు దాటేందుకు యువకులు ప్రయత్నించడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
పాట్నా: బిహార్(Bihar)లోని పూర్ణియా (Purnea)లో విషాద ఘటన చోటుచేసుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) ఢీకొని నలుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. జోగ్బాని నుంచి పాటలీపుత్రకు రైలు వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను జీఎంసీకి తరలించగా.. మృతదేహాలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.
పట్టాలు దాటుతున్న యువకులను హైస్పీడు రైలు ఢీకొట్టినట్టు స్థానికుల సమాచారం. రైల్వే క్రాసింగ్ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా?, రైలు వేగంగా వస్తున్న విషయం తెలిసినా పట్టాలు దాటేందుకు యువకులు ప్రయత్నించడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
దుర్గా మేళాలో సాంస్కృతిక కార్యక్రమాలు చూసేందుకు వెళ్లిన యువకులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. వేగంగా వస్తున్న రైలు ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించగా.. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశాడు. గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారంతా 18 నుంచి 24 ఏళ్ల వయస్సు వారేనని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం.. ఐఏఎఫ్ చీఫ్ గూస్‌బమ్స్ కామెంట్లు
టీవీకే పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి