Delhi Results: ఫలితాలపై ఉత్కంఠ.. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? గతంలో ఏం చెప్పాయి.. ఏ జరిగిందంటే..
ABN , Publish Date - Feb 07 , 2025 | 10:10 PM
ఎగ్జిట్ పోల్స్ తమను తక్కువగా అంచనా వేసిన ప్రతిసారి అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయని, ఈసారి కూడా ఆప్‌దే గెలుపని, నాలుగోసారి కేజ్రీవాల్ సీఎం పగ్గాలు చేపడతారని ఆమ్ ఆద్మీ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గతంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? జరిగిందేమిటి? ఒకసారి విశ్లేషిద్దాం.

న్యూఢిల్లీ: మరి కొద్ది గంటల్లోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ జరిగిన 70 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఫలితాలు ప్రకటించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈనెల 5న పోలింగ్ అనంతరం మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకే పట్టం కట్టాయి. 27 ఏళ్ల తర్వాత 'కమల' వికాసం తథ్యమని ఢంకా బజాయించాయి. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుతున్నారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో స్పష్టమైందని బీజేపీ స్పందిస్తే, ఎగ్జిట్ పోల్స్ తమను తక్కువగా అంచనా వేసిన ప్రతిసారి అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయని, ఈసారి కూడా ఆప్‌దే గెలుపని, నాలుగోసారి కేజ్రీవాల్ సీఎం పగ్గాలు చేపడతారని ఆమ్ ఆద్మీ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గతంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? జరిగిందేమిటి? ఒకసారి విశ్లేషిద్దాం.
ACB Notice to Kejriwal: కేజ్రీవాల్‌కు 5 ప్రశ్నలతో ఏసీబీ నోటీసు
2013 ఎగ్జిట్ పోల్స్
2013 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా అంచనాలు వేశాయి. 35 సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని, ఆప్, కాంగ్రెస్ చెరో 17 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేశాయి. అయితే అంచనాలకు భిన్నంగా ఆప్ 28 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 32 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం 8 సీట్లు సాధించింది. దీంతో కాంగ్రెస్ సపోర్ట్‌తో ఆప్ స్వల్పకాలం ఢిల్లీలో పాలన సాగించింది.
2015లో..
2015లో 6 ఎగ్జిట్ పోల్స్ ఆప్ విజయం సాధిస్తుందని అంచనా వేసినప్పటికీ సాధించబోయే సీట్లను సరిగా అంచనా వేయలేకపోయాయి. ఆప్ యావరేజ్‌గా 45 సీట్లు గెలవచ్చని సర్వే సంస్థలు అంచనా వేశారు. అయితే ఆప్ 67 సీట్లతో రికార్డు స్థాయి విజయం సొంతం చేసుకుంది. బీజేపీ కేవలం 3 సీట్లకే పరిమితం కాగా, కాంగ్రెస్ ఖాతా కూడా తెరవకుండా చతికిల పడింది.
2020లో..
2020లో ఆప్ ఆధిపత్యం ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఎన్ని సీట్లు గెలచవచ్చనే అంచనాల్లో విఫలమయ్యాయి. యావరేజ్‌గా 52 సీట్లు ఆప్ గెలుచుకుంటుందని, బీజేపీకి 17 వస్తాయని అంచనా వేశాయి. అయితే ఇందుకు భిన్నంగా ఆప్ 62 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ మరోసారి ఒక్క సీటు కూడా గెలవకుండా చతికిలపడింది.
ఆసారి 55 ఖాయం... కేజ్రీవాల్
కాగా, 2025 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను 'ఆప్' చీఫ్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు. 55 సీట్లు ఆప్‌కు వస్తాయని, మహిళా ఓటర్లు పూర్తి స్థాయిలో ఓటింగ్ జరిపితే 55 నుంచి 60 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనవరసం లేదని అన్నారు. ఏదిఏమైనా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? కేజ్రీవాల్ జోస్యం ఫలిస్తుందా అనేది మరికొద్ది గంటల్లోనే తేలనుంది.
ఇవి కూడా చదవండి..
AAP: ఆప్ నేతల వ్యాఖ్యలపై జెట్‌స్పీడ్ రియాక్షన్.. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ
Maha Kumbh 2025: మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి