Delhi High Court Bomb Threat: ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:47 PM
ఢిల్లీ హైకోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. మూడు ప్రదేశాల్లో RDX పెట్టినట్లు మెయిల్ రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. హైకోర్టులో బాంబులు పెట్టినట్లు సెక్యూరిటీ సిబ్బందికి బెదిరింపు(Bomb Threat) మెయిల్ వచ్చింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అగంతకులు పంపిన మెయిల్‌లో హైకోర్టు ఆవరణలో మూడు ప్రదేశాల్లో RDX అమర్చినట్లు పేర్కొన్నారు.
బాంబ్ పెట్టిన నిందితులకు పాక్, ఐసిస్‌తో సంబంధాలున్నట్లు ప్రస్తావించారు. దీంతో ఈ వ్యవహారం మరింత టెన్షన్ క్రియేట్ చేసింది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు రంగంలోకి దిగారు. కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. పోలీసులు, బాంబ్ స్క్వా్డ్ (Bomb Disposal Squads), డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. బాంబు బెదిరింపులతో స్థానిక ప్రజలు సైతం తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Also Read:
సింగపూర్‌కు ధర్మవరం విద్యార్థినులు
వీళ్ల క్రియేటివిటీ తగలెయ్య.. ఐ ఫోన్‌ను ఎలా సెట్ చేశారో చూస్తే..
For More Latest News