Share News

AP News: సింగపూర్‌కు ధర్మవరం విద్యార్థినులు

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:55 PM

పట్టణంలోని బీఎస్ఆర్‌ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఫ్లోర్‌బాల్‌ పోటీల్లో అద్భుత ప్రతిభ చూపినట్లు హెచ్‌ఎం జ్యోతిలక్ష్మి, పీడీ లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యార్థుల విజయాన్ని పురస్కరించుకుని గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

AP News: సింగపూర్‌కు ధర్మవరం విద్యార్థినులు

- ఫ్లోర్‌బాల్‌ పోటీలకు 12 మంది ఎంపిక

ధర్మవరం(అనంతపురం): పట్టణంలోని బీఎస్ఆర్‌ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఫ్లోర్‌బాల్‌ పోటీల్లో అద్భుత ప్రతిభ చూపినట్లు హెచ్‌ఎం జ్యోతిలక్ష్మి, పీడీ లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యార్థుల విజయాన్ని పురస్కరించుకుని గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం, పీడీ మాట్లాడుతూ గత నెలలో నరసరావుపేట(Narasaraopet)లో జరిగిన 19వ నేషనల్‌ ఫ్లోర్‌బాల్‌ పోటీలలో తమ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాటి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు.


pandu1.jpg

అండర్‌-14 విభాగంలో 14 మంది జాతీయ స్థాయిలో పాల్గొనగా 12మంది అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారన్నారు. 8వతరగతికి చెందిన గీతిక, హేమశ్రీ, అప్నా అంజన్‌, రోహిణి, సాయిగీతిక, జాహ్నవి, 9వతరగతికి చెందిన తేజశ్రీ, నందిని, ఉషశ్రీ, శ్రీదేవి, ఈశ్వరి, గౌతమి పోటీలకు ఎంపికయ్యారని వెల్లడించారు.


pandu1.3.jpg

వీరు ఈనెల నాలుగో వారం లేదా అక్టోబరు మొదటి వారంలో సింగపూర్‌(Singapore)లో నిర్వహించే ఫ్లోర్‌బాల్‌ అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. వీరిని బీఎస్ఆర్‌ బాలుర ఉన్నతపాఠశాల హెచ్‌ఎం మేరి వరకుమారి, పాఠశాల కమిటీ చైర్మన్‌ బాబావలి, ఉపాధ్యాయులు అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

967 డిగ్రీ కళాశాలల్లో 2.41 లక్షల సీట్లు

లాకర్‌ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 12 , 2025 | 12:55 PM