Rekha Gupta: మొదటి రోజు నుంచే ఆఫీస్‌కు.. పోస్ట్ కొత్తదైనా..స్టైల్ పాతదే
ABN , Publish Date - Feb 20 , 2025 | 08:00 PM
Rekha Gupta: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా.. వెంటనే సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం సీఎం చాంబర్‌లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు.. ఆమె షెడ్యుల్ చేస్తే.. బీజేపీ అగ్రనేతలు ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించారనేది తెలుస్తోంది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా నేరుగా రంగంలోకి దిగిపోయారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తికాగానే ఆమె నేరుగా సెక్రటేరియట్‌కు పయనమయ్యారు. సెక్రటేరియట్‌లోని ముఖ్యమంత్రి చాంబర్‌లోకి ఆమె ప్రవేశించి.. బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో కార్యాలయ సిబ్బందితో ఆమె మాట్లాడారు.
అనంతరం సాయంత్రం 5.00 గంటలకు యమునా బజార్‌లోని వాసుదేవ్ ఘాట్‌ను ఆమె సందర్శించారు. అనంతరం మళ్లీ ఆమె సెక్రటేరియట్‌కు చేరుకోనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 7.00 గంటలకు సీఎం రేఖా గుప్తా అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఆమె ప్రమాణ స్వీకారం కార్యక్రమంలోనే ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
తొలిరోజే ఇలా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా.. అలా సెక్రటేరియట్‌కు వెళ్లి వెళ్లారు. ఆ క్రమంలో ఆమె ముహూర్త బలాన్ని సైతం చూసుకోలేదు. అందరి ముఖ్యమంత్రుల్లాగా కాకుండా.. ఆమె.. సీఎం చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో కార్యాలయ సిబ్బందిని ఆమె స్వయంగా పరిచయం చేసుకున్నారు. ఇక బీజేపీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు కోసం పారాటం చేస్తామంటూ ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు ప్రకటించారు.
Also Read: కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

ఈ నేపథ్యంలో హామీల అమలుతోపాటు.. ఆప్ నేతల ఆరోపణలు, విమర్శలకు ఏ మాత్రం తావివ్వ కూడదనే ఓ విధమైన లక్ష్యంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేఖా గుప్తా తనదైన శైలిలో ముందు వెళ్తున్నారు. అదీకాక.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసుకోవాలని భావించిన ఆప్ ఆద్మీ పార్టీకి ఓటర్లు ఓటమి రుచిని చవి చూపించారు.
Also Read: ఈసీ కన్నా జగన్ గొప్పవాడా?

ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వలోని లోపాలను ఎత్తి చూపేందుకు ఆ పార్టీ రంధ్రాన్వేషణ సాగించే అవకాశముంది. అలాంటి వేళ.. హామీల అమలు, ప్రజా సంక్షేమ పాలన అందించడమే లక్ష్యంగా పాలన సాగిస్తుందని రేఖా గుప్తా వ్యవహార శైలిపై అవగాహన ఉన్న ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Also Read: ఎమ్మెల్యేకి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక

ఇక చిన్న నాటి నుంచి అంటే.. పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకొని.. అనంతరం కాలేజీలో అడుగు పెట్టింది. ఓ వైపు ఉన్నత విద్యను ఆమె అభ్యసిస్తూనే.. మరోవైపు ఏబీవీపీ నేతగా తీసుకున్న పలు కీలక నిర్ణయాలు సహచర విద్యార్థులకు మనస్సును చొరగున్నాయి. అంతేకాదు క్రమశిక్షణతో మసలుకోవడంతోపాటు అప్పగించిన ప్రతి పని నిబద్దతతో పూర్తి చేయడం ద్వారా అమెకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే.. పీతంపురా కార్పొరేటర్‌గా ఆమె ఎన్నికైన నాటి నుంచి ఆ డివిజన్‌లో చేపట్టిన పలు సంక్షేమ పథకాలు రేఖా గుప్తా అభ్యన్నతికి సోపానంగా మారిందనే అభిప్రాయం సైతం దేశ రాజధాని ప్రజల్లో ప్రస్పుటమవుతోంది.
Also Read: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక మార్పులు..

డివిజన్‌లోని ప్రజల కష్ట సుఖాల్లో ఆమె పాలుపంచుకోంది. వారికి పెన్షన్లు మంజూరు విషయం పెద్ద యజ్జమే చేసింది. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చిన.. ఎవరు అర్థరాత్రి తలుపు తట్టినా.. తాను అండ.. దండ.. గా ఉన్నానంటూ వారికి భరోసా కల్పించే వారు. ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా.. తనను సంప్రదించాలంటూ.. తన సెల్ నెంబర్‌ను.. రేఖా గుప్తా అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచింది.
Also Read: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు
Also Read: రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆప్ ఎంపీ ప్రత్యక్షం

చేతిలో కొద్దిగా నగదు, చిన్న పలుకుబడి ఉన్న పదవి లభిస్తే.. మీ స్థాయి ఎంత అన్నట్లుగా ప్రవర్తించే చోటా మోటా నాయకులున్న ఈ కాలంలో.. తన సెల్ ఫోన్ సైతం అందరికి అందుబాటులో ఉంచిందీ రేఖా గుప్తా. తాను ఉన్నది మీ సేవకేనంటూ ప్రజలకు క్లియర్ కట్‌గా స్పష్టం చేసింది. ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వానికి సైతం రేఖా గుప్తా పని తీరుపై ప్రగాఢ విశ్వాసం ఉంది. అందుకే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమెకు ఢిల్లీ పీఠాన్ని సైతం ఏ మాత్రం ఆలోచించకుండా అప్పగించింది. ఆ క్రమంలోనే.. ఫస్ట్ డే ఫర్‌ఫెక్ట్‌గా.. రంగంలోకి దిగిపోయారు ఆమె. దటీజ్ రేఖా గుప్తా.
For National News And Telugu News