Share News

CM Revanth Reddy: కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Feb 20 , 2025 | 06:58 PM

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. నాంపల్లిలోని కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పలు కేసులు సీఎం రేవంత్ రెడ్డిపై నమోదయ్యాయి. దాంతో గురువారం నాంపల్లి కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం వస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

CM Revanth Reddy: కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్, ఫిబ్రవరి 20: నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల వేళ.. ప్రచారంలో భాగంగా ఆయన చేసిన ప్రసంగంపై నాటి బీఆర్ఎస్ పార్టీ నేతలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌, మెదక్ జిల్లాలోని కౌడిపల్లి, హైదరాబాద్‌లోని బేగం బజార్, తిరుమలగిరి, పెద్దవూర, కమలపూర్‌తోపాటు నల్గొండలో మొత్తం తొమ్మిది కేసులు రేవంత్ రెడ్డిపై నమోదయ్యాయి.

ఈ కేసుల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. అలాగే బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందంటూ.. గత ఎన్నికల్లో వీడియో సైతం విడుదల చేసిన వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు అయింది. ఆ సమయంలో పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి.. ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు.

సీఎం కోర్టుకు వస్తుండడంతో.. నాంపల్లిలో కోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఈ కేసు తదుపరి విచారణ మార్చి 23వ తేదీకి వాయిదా వేశారు. అయితే టీపీసీసీ చీఫ్ తిరుపతి వర్మ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో ఈ కేసులను నమోదు చేశారని కోర్టుకు వివరించారు.

మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ఈసీ కన్నా జగన్ గొప్పవాడా?

Also Read: ఎమ్మెల్యేకి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక

Also Read: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక మార్పులు..

Also Read: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు

Also Read: రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆప్ ఎంపీ ప్రత్యక్షం

For Telangana News And Telugu News

Updated Date - Feb 20 , 2025 | 07:02 PM