Share News

Customs Raid In Dulquer Salmaan House: ప్రముఖ నటుల నివాసంలో కస్టమ్స్ అధికారులు సోదాలు..

ABN , Publish Date - Sep 23 , 2025 | 01:29 PM

లగ్జరీ కార్లు అక్రమంగా దిగుమతి చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్‌తోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాల్లో కస్టమ్స్ అధికారులు సోదాలు చేపట్టారు.

Customs Raid In Dulquer Salmaan House: ప్రముఖ నటుల నివాసంలో కస్టమ్స్ అధికారులు సోదాలు..

తిరువనంతపురం, సెప్టెంబర్ 23: లగ్జరీ కార్లు అక్రమంగా దిగుమతి చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ నటులు దుల్కర్ సల్మాన్‌తోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాల్లో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం కేరళలోని కొచ్చిలోని వీరిద్దరి నివాసాల్లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అలాగే కేరళలోని మొత్తం 30 ప్రదేశాల్లో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. భూటాన్‌ నుంచి లగ్జరీ కార్లు దిగుమతి చేసుకున్నారంటూ వీరితోపాటు పలువురిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కస్టమ్స్ అధికారులు రంగంలోకి దిగి.. ఈ సోదాలు చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బ్రహ్మోత్సవాల వేళ.. వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్..

నవరాత్రులు.. అమ్మవారికి నైవేద్యాలు..

For More AP News And Telugu News

Updated Date - Sep 23 , 2025 | 01:48 PM