Brahmotsavam In Tirumala: బ్రహ్మోత్సవాల వేళ.. వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్..
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:35 AM
శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ.. తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు 16 రకాల వంటకాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.
తిరుమల, సెప్టెంబర్ 23: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా భక్తులకు ఈ ఏడాది ప్రత్యేకంగా 16 రకాల వంటకాలను టీటీడీ పంపిణీ చేయనుంది. వాహన సేవల కోసం మాడ వీధుల్లో వేచి ఉండే భక్తులకు 45 నిమిషాల వ్యవధిలో 35 వేల మందికి రీఫిల్లింగ్ ద్వారా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసింది. మాడ వీధుల బయట ఉండే వారు వీక్షించేందుకు వీలుగా 36 ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసింది. ఇక సామాన్యులకు ఇబ్బంది లేకుండా దేవుడి దర్శనానికి సైతం చర్యలు చేపట్టింది.
ఈ ఏడాది బ్రహ్మోత్సవాల ప్రత్యేకలు ఇవి..
రోజుకు 8 లక్షల లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంచుతారు.
బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులూ.. శ్రీవారి ఆలయంలో రూ. 3. 5 కోట్ల విలువైన 60 టన్నుల పుష్పాలను వినియోగిస్తారు.
ఈ బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక ప్రదర్శనల కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 229 కళా బృందాలను తిరుమలకు రప్పించారు.
3500 మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచారు.
కొండపై ప్రతి నాలుగు నిమిషాలకు ఒకసారి టీటీడీ, ప్రభుత్వ బస్సుల ద్వారా యాత్రికులను నిర్దేశిత ప్రాంతాలకు చేరవేస్తారు.
నిఘా కోసం వేలాది సీసీ కెమెరాలను తిరుపతి, తిరుమలలో ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు.
వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఉదయం 8.00 గంటల నుంచి రాత్రి 11.00 గంటల వరకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేస్తారు.
ప్రతీ 100 మీటర్లకు ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న వాటికి అదనంగా మరిన్ని సమాచార కేంద్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకు వచ్చారు.
పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక యాప్‌ను సైతం టీటీడీ అందుబాటులోకి తీసుకు వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా శ్రీవారికి భక్తులు ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా తిరుమలకు తరలిరానున్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగ కుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు టీటీడీ అధికారులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నవరాత్రులు.. అమ్మవారికి నైవేద్యాలు..
వాకింగ్..? సైక్లింగ్..? ఈ రెండింటిలో ఏది మంచిది?
For More Devotional News And Telugu News