Congress Bidis Bihar Post: బీడీ, బిహార్ బితోనే మొదలవుతాయి.. కాంగ్రెస్ పోస్ట్‌పై వివాదం
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:20 PM
కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన జీఎస్‌టీ శ్లాబుల్లో భాగంగా సిగరెట్, పొగాకుపై ఉన్న 28 శాతం పన్నును 40 శాతానికి పెంచింది. బీడీలపై పన్నును 28 నుంచి 18 శాతానికి తగ్గించింది. దీన్ని విమర్శిస్తూనే కేరళ కాంగ్రెస్ యూనిట్ పోస్ట్ పెట్టింది.
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు బిహార్ (Bihar) సిద్ధమవుతున్న వేళ సిగరెట్, పొగాకు, బీడీలపై కేంద్రం నిర్ణయించిన జీఎస్‌టీ (GST)లను విమర్శిస్తూ కాంగ్రెస్ (Congress) పార్టీ పెట్టిన ఒక పోస్టు వివాదమైంది. బీడీ, బిహార్ 'బి'తోనే మొదలవుతాయని, వాటిని ఇకపై పాపంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేరళ కాంగ్రెస్ యూనిట్ శుక్రవారంనాడు పెట్టిన పోస్టు ఈ వివాదానికి కారణమైంది.
కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన జీఎస్‌టీ శ్లాబుల్లో భాగంగా సిగరెట్, పొగాకుపై ఉన్న 28 శాతం పన్ను 40 శాతానికి పెంచింది. బీడీలపై పన్నును 28 నుంచి 18 శాతానికి తగ్గించింది. దీన్ని విమర్శిస్తూనే కేరళ కాంగ్రెస్ యూనిట్ పోస్ట్ పెట్టింది. దీనిపై జేడీయూ, బీజేపీ విమర్శలు గుప్పించింది. బిహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి ఈ పోస్ట్‌పై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారు. ఇది మొత్తం బిహార్ రాష్ట్రానికే అవమానమని, కాంగ్రెస్ నిజస్వరూపం ఏమిటో మరోసారి దేశప్రజానీకానికి తేటతెల్లమైందని అన్నారు. జేడీయూ నేత సంజయ్ కుమార్ ఝా సైతం 'కాంగ్రెస్ సిగ్గుమాలిన చర్య'గా దీనిని పేర్కొన్నారు. 'బీ అంటే కేవలం బీడీనే కాదు, బుద్ధి కూడా. అది మీకు లేదు' అని ఝా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అన్నిహద్దులు అతిక్రమించింది
బీజేపీ అధికార ప్రతినిధి షెహబాజ్ పునావాలా కాంగ్రెస్‌పై ఎక్స్‌లో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మరోసారి అన్ని హద్దులు అతిక్రమించిందని, ఈ వ్యాఖ్యలను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆమోదిస్తారా అని ప్రశ్నించారు. మొదట ప్రధాన మంత్రి, ఆయన తల్లిని టార్గెట్ చేసుకుని అవమానించారని, ఇప్పుడు బీహార్ మొత్తాన్ని అవమానించారని అన్నారు.
పోస్ట్ తొలగించిన కాంగ్రెస్
బీడీ-బిహార్ పోస్టుపై వివాదం రేగడంతో కేరళ కాంగ్రెస్ ఆ పోస్టును తొలగించింది. మోదీ ఎన్నికల జిమ్మిక్ అయిన జీఎస్టీ రేట్లను ఉద్దేశిస్తూ చేసిన పోస్టు తమ దృష్టికి వచ్చిందని, ఇది మిమ్మల్ని బాధపెడితే క్షమించండని కాంగ్రెస్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఇవి కూడా చదవండి..
34 వాహనాల్లో మానవబాంబులు.. బెదిరింపు మెసేజ్‌తో హైఅలర్ట్
భారీ ఎన్ కౌంటర్.. మావోయిస్టులకు ఎదురుదెబ్బ..
For More National News And Telugu News