Chhattisgarh: భారీ ఎన్ కౌంటర్.. మావోయిస్టులకు ఎదురుదెబ్బ..
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:59 PM
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్‌గఢ్: నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాగా, ఈ ఘటన ఇవాళ (శుక్రవారం) ఉదయం దంతెవాడ- బీజాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
దంతెవాడ- బీజాపూర్ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందడంతో ప్రత్యేక దళాలు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో రెండు వర్గాలు ఎదురుపడ్డాయి. దీంతో ఇరువైపులా కాల్పులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. సంఘటనా స్థలంలో ఆయుధాలు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్ తో ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాగా, మృతి చెందిన మావోయిస్టులను గుర్తించే పనిలో భద్రత దళాలు ఉన్నాయి.
Also Read:
ప్రధాని నరేంద్రమోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
బ్రాడ్‌కామ్‌తో కలిసి సొంత AI చిప్‌లను రూపొందించనున్న ఓపెన్ ఏఐ
For More Latest News