Share News

OpenAI own AI chips with Broadcom: బ్రాడ్‌కామ్‌తో కలిసి సొంత AI చిప్‌లను రూపొందించనున్న ఓపెన్‌ ఏఐ

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:44 PM

ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం ఎన్విడియా(Nvidia) కంపెనీపై ఆధారపడకుండా ఉండటానికి ఓపెన్ ఏఐ ( Open AI) బ్రాడ్‌కామ్‌తో కలిసి దాని స్వంత AI చిప్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని గుర్తించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

 OpenAI own AI chips with Broadcom: బ్రాడ్‌కామ్‌తో కలిసి సొంత AI చిప్‌లను రూపొందించనున్న ఓపెన్‌ ఏఐ
OpenAI

ఇంటర్నెట్ డెస్క్: ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఓపెన్ ఏఐ (Open AI) తన సొంత AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చిప్‌ను రూపొందించడానికి బ్రాడ్‌కామ్‌తో కలిసి పని చేయబోతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కువగా ఎన్విడియా (NVIDIA) యాక్సిలరేటర్లు (ప్రాసెసింగ్ పవర్ ఇచ్చే స్పెషల్ చిప్‌లు) ఆధిపత్యం చూపిస్తుండుగా ఎన్విడియాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఓపెన్ ఏఐ ప్రయత్నిస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ(ChatGPT) వంటి AI మోడళ్ల కోసం అవసరమయ్యే ప్రాసెసింగ్ శక్తిని తన సొంత చిప్ ద్వారా స్వయంగా అందించాలనుకుంటోంది. తద్వారా NVIDIA వంటి పెద్ద చిప్ తయారీదారులపై ఆధారపడకుండానే AI సిస్టమ్‌లను నడిపించాలని ప్లాన్ వేసింది.


FT నివేదిక ప్రకారం, ఓపెన్ ఏఐ రూపొందిస్తున్న మొదటి AI చిప్ యూనిట్లు 2026లో అందుబాటులోకి రానున్నాయి. కానీ, మొదటిగా తన చిప్‌ లను.. ఓపెన్ ఏఐ తమ సొంత AI సిస్టమ్‌లలో మాత్రమే ఉపయోగించనున్నారు. బయట మార్కెట్‌లోకి విడుదల చేయరు. ఈ ప్రయత్నం సక్సెస్‌ అయితే తర్వాత ఓపెన్ ఏఐ వాటిని ఎన్విడియా కంపెనీకి కాంపిటీషన్‌గా మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.


బ్రాడ్‌కామ్ CEO హాక్ టాన్ గురువారం జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో మాట్లాడుతూ, తమ కంపెనీ AI యాక్సిలరేటర్ చిప్‌లను రూపొందించడానికి కొంతమంది కస్టమర్లతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. అయితే, ఎవరెవరు భాగస్వాములు అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పకపోయినా, ఒక పెద్ద క్లయింట్ తాజాగా భారీ ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపారు. ఆ ఆర్డర్ల వల్ల 2026 ఆర్థిక సంవత్సరానికి బ్రాడ్‌కామ్‌ కంపెనీ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.


OpenAI కొత్త ప్రాజెక్ట్

త్వరలో ఓపెన్ ఏఐ కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతోంది. వచ్చే ఏడాది నుంచి ఓపెన్ ఏఐ ఒక AI జాబ్ ప్లాట్ ఫామ్(Job Platform)ను ప్రారంభించబోతోంది. దీని ద్వారా AI నైపుణ్యం ఉన్న వారు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే యజమానులను నేరుగా కలుసుకునే అవకాశం ఉంటుంది.


సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ (Certification Program):

ChatGPT డెవలపర్, రాబోయే నెలల్లో ఒక ప్రత్యేక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా ప్రవేశపెడుతుంది. దీని ద్వారా ఉద్యోగులు తమ పనిలో AIని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడం నేర్చుకుంటారు. ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడానికి, OpenAI అమెరికాలోని అత్యంత పెద్ద ప్రైవేట్ కంపెనీ వాల్ మార్ట్ ( Walmart) సహా అనేక కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. ఓపెన్ ఏఐ 2030 నాటికి 1 కోటి (10 మిలియన్) అమెరికన్లకు సర్టిఫికేషన్ ఇవ్వడం తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. అంటే, AI రంగంలో నైపుణ్యం ఉన్న వారిని కంపెనీలకు సరిపడే ఉద్యోగాలకు కలిపే పెద్ద వేదికను ఓపెన్ ఏఐ నిర్మిస్తోంది.


Also Read:

ఫోన్ నంబర్ లక్కీనో, కాదో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి.!

ఘనంగా గణేశ్ నిమజ్జనాలు.. లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

For More latest News

Updated Date - Sep 05 , 2025 | 12:56 PM