-
-
Home » Devotional » Ganesh immersion going on with great pomp and show across Hyderabad and the country suri
-
Ganesh Immersion: ఘనంగా గణేశ్ నిమజ్జనాలు.. లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ABN , First Publish Date - Sep 05 , 2025 | 11:13 AM
దేశవ్యాప్తంగా గణేశ్ శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా వివిధ రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనాలతో భక్తులు పరవశించిపోతున్నారు. ఇక, హైదరాబాద్ మహానగరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేల సంఖ్యలో గణనాథుని విగ్రహాలు నగరవ్యాప్తంగా కొలువుతీశారు. కాగా, ఇవాళ(శుక్రవారం) పదో రోజు కావడంతో వందల సంఖ్యలో విగ్రహాలు హుస్సేన్ సాగర్ సహా పలు ప్రాంతాల్లో నిమజ్జనం అవుతున్నాయి. ఆ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం..
Live News & Update
-
Sep 05, 2025 18:29 IST
గణేశ్ నిమజ్జనం సంబంధించి మా ప్రతినిది ప్రవీణ్ గ్రౌండ్ రిపోర్ట్
-
Sep 05, 2025 17:20 IST
భూపాలపల్లి జిల్లాలో మహాదేపూర్ మండలం కాలేశ్వరంలో నిమజ్జనానికి సేవతో బయలుదేరిన గణపతుడు డ్యాన్సులతో మహిళలు కోలాటం చేస్తున్న దృశ్యం

-
Sep 05, 2025 16:53 IST
హైదరాబాద్ మెట్రో.. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.
రేపు(శనివారం) మెట్రో సమయంలో మార్పులు చేస్తూ.. అధికారులు ప్రకటన విడుదల చేశారు.
నగరంలోని అన్ని మెట్రో స్టేషన్ల నుంచి రేపు(శనివారం) ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
-
Sep 05, 2025 16:31 IST




-
Sep 05, 2025 16:28 IST
వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్లచెరువు వద్ద రేపటి నుంచి నిర్వహించే గణపయ్య నిమజ్జనానికి సంబంధించి నల్లచెరువు దగ్గర ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ రావుల గిరిధర్.
-
Sep 05, 2025 15:54 IST
గణేష్ నిమజ్జన ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్
దేశంలో మొదటి సారి గణేష్ మండపలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చాము
లక్షల మంది గణేషుడిని దర్శించుకున్నారు
60 లక్షల మందికి పైగా భక్తులు గణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది
అందరికీ గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుతున్న
-
Sep 05, 2025 15:12 IST
వినాయక నిమజ్జనానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి విషయాలపై ABN స్పెషల్ వీడియోను చూడండి.
-
Sep 05, 2025 15:10 IST
రేపు ఉ.6 గంటల నుంచి మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం
ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా దగ్గర నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు
విగ్రహాల ఎత్తుల ప్రకారం రూట్ మ్యాప్ తయారుచేశాం: సీపీ సీవీ ఆనంద్
శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదు: సీపీ సీవీ ఆనంద్
ట్రాఫిక్ సమస్యలు రాకుండా రూట్ డైవర్షన్లు: సీపీ సీవీ ఆనంద్
250 కెమెరాలు, 9 డ్రోన్లతో హుస్సేన్ సాగర్ దగ్గర భద్రత: సీవీ ఆనంద్
-
Sep 05, 2025 12:31 IST
ఖైరతాబాద్ కు సీఎం రేవంత్‌రెడ్డి
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం వెంట మంత్రుల పొన్నం, కొండా సురేఖ, మహేష్‌గౌడ్
-
Sep 05, 2025 12:28 IST
గణేశ్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద సందడి..
నిమజ్జనాలకు పెద్దఎత్తున తరలివస్తున్న వినాయక విగ్రహాలు
వందల సంఖ్యలో క్యూ కడుతున్న గణనాథుడి వాహనాలు
వేల సంఖ్యలో తరలివస్తున్న భక్తజన సంద్రం
-
Sep 05, 2025 11:14 IST
ఖైరతాబాద్‌కు సీఎం..
కాసేపట్లో ఖైరతాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
మహాగణపతిని దర్శించుకోనున్న సీఎం రేవంత్‌రెడ్డి
-
Sep 05, 2025 11:14 IST
నల్లగొండ: పాతబస్తీ ఒకటో విగ్రహం దగ్గర ఉద్రిక్తత
మంత్రి కోమటిరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ నేతలు
గణేష్ ఉత్సవాల్లో రాజకీయ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం
కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట, చెదరగొట్టిన పోలీసులు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తల ఆందోళన
-
Sep 05, 2025 11:13 IST
గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి ఉదయం వరకు ఆంక్షలు
బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు గణేష్ శోభాయాత్ర
ప్రధాన రహదారులపై ఇతర వాహనాలకు అనుమతి నిరాకరణ
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచన
-
Sep 05, 2025 11:13 IST
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం
303 కిలోమీటర్ల మేర కొనసాగనున్న గణేష్ శోభాయాత్రలు
13 కంట్రోల్ రూమ్‌లు, 30 వేల మందితో పోలీసు బందోబస్తు
160 యాక్షన్ టీంలు, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జీహెచ్‌ఎంసీ
నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులు
134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు, హుస్సేన్ సాగర్‌లో 9 బోట్లు సిద్ధం
శానిటేషన్ కోసం విధుల్లో 14,486 మంది GHMC సిబ్బంది
అందుబాటులో DRF బృందాలు, 200 మంది గజఈతగాళ్లు