Share News

CM Stalin: సీఎం స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు.. మా ఓటమి కోసం వారు తపిస్తున్నారు..

ABN , Publish Date - May 08 , 2025 | 01:18 PM

మా ఓటమి కోసం ప్రతిపక్ష పార్టీలు తపిస్తున్నాయని, కానీ... వారు అనుకున్నట్లు అలాంటిదేమీ జరగబోదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. వారు ఎన్ని ప్రయోగాలు చేసినా.. ప్రజలు తమవైపే ఉన్నారన్నారు. అంతేగాక.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన అన్నారు.

CM Stalin: సీఎం స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు.. మా ఓటమి కోసం వారు తపిస్తున్నారు..

- మా మంచి పథకాలను ప్రశంసించండి

- మీడియా ప్రతినిధుల భేటీలో సీఎం స్టాలిన్‌

చెన్నై: డీఎంకే ద్రావిడ తరహా పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో యేటా సగర్వంగా అడుగుపెడుతోందని, ఎన్నికల సమయంలో ప్రకటించిన ఎన్నో హామీలనే కాకుండా చెప్పని పథకాలను కూడా అమలు చేసి ప్రజల ఆదరాభిమానాలను మెండుగా పొందామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. స్థానిక చేపాక్‌ కలైవానర్‌ అరంగంలో మంగళవారం ఉదయం ఏర్పాటైన పత్రికాధిపతులు, సంపాదకులు, సీనియర్‌ పాత్రికేయుల సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశంలో సమాచార శాఖ మంత్రి సామినాథన్‌ స్వాగతోపన్యాసం చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Special Court: 23న గైర్హాజరైతే.. ఛార్జిషీట్‌ నమోదు


అనంతరం స్టాలిన్‌ మాట్లాడుతూ... 2021 ఆరోసారి డీఎంకే అధికారంలోకి వచ్చిందని, ఆ యేడాది మే 7న సీఎంగా బాధ్యతలు స్వీకరించానని, బుధవారం తమ ప్రభుత్వం ఐదో యేట అడుగుపెట్టనుందని చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి పథకాలపై పత్రికలు ప్రశంసించాలని, అదే సమయంలో తమ పాలనలో తప్పిదాలుంటే విమర్శించాలని, తానెప్పుడూ కూడా సద్విమర్శలకే ప్రాధాన్యం ఇస్తానన్నారు. ఆ విమర్శలకు అనుగుణంగా పాలనలో మార్పులు తెచ్చేందుకు కూడా వెనుకాడనని చెప్పారు.


పథకాల బాట...

కలైంజర్‌ మహిళా సాధికారిక నగదు పంపిణీ పథకం, సిటీ, టౌన్‌ బస్సుల్లో మహిళకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే మహిళల వెలుగుబాట పయనం పథకం, బడి పిల్లలకు సీఎం అల్పాహార పథకం, విద్యార్థినులకు పుదుమై పెణ్‌, విద్యార్థులకు నాన్‌ ముదల్వన్‌ పథకం అమలు చేస్తున్నామని, తమ ప్రభుత్వం విద్యా, వైద్యరంగాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. వీటితోపాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధిపరిచేందుకు ఎన్నో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేశానని స్టాలిన్‌ వివరించారు.


పాలన ఆదర్శం...

దేశానికే ఆదర్శవంతమైన పలు పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, తమ పథకాలను చూసి మెచ్చుకుని ఇతర రాష్ట్రాలకు కూడా ఇలాంటి పథకాలనే మార్పులు చేర్పులు కల్పించి అమలు చేస్తున్నాయని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షాలన్నీ ద్రావిడ తరహా పాలనలో అమలు చేస్తున్న పథకాలకు ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతుండటంతో ఓర్వలేక అదేపనిగా పసలేని విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాయని, అంతే కాకుండా ఈ ప్రభుత్వం ఎప్పుడు పతనమవుతుందా అని ఎదురు చూస్తున్నారని, వారి ఆశలు నెరవేరే ప్రసక్తే లేదని ఏడోసారి కూడా డీఎంకే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదో యేట అడుగుపెడుతున్న తమ ప్రభుత్వంపై ఎప్పటిలాగే సద్విమర్శలు చేయాలని, మంచి పథకాలను మెచ్చుకోకపోయినా పరవాలేదు, తిట్టిపోయకుండా ఉంటే మంచిదని అన్నారు. గత నాలుగేళ్లుగా సీనియర్‌ పాత్రికేయులతో, పత్రికల సంపాదకులతో తాను సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నానని, భవిష్యత్తులోనూ అలాగే ఉంటానని చెప్పారు.


ఎన్నికల పనులు ప్రారంభించండి...

వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లోనూ డీఎంకే ఘనవిజయం సాధిస్తుందని, పార్టీ శ్రేణులంతా ఇప్పటి నుంచే ఎన్నికల పనులను ప్రారంభించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు మంగళవారం లేఖ రాశారు. రాష్ట్ర హక్కులను హరిస్తూ, కులపరంగా, మతపరంగా చిచ్చురేపేందుకు ప్రయత్నించే మతతత్వ పార్టీ బీజేపీతో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే అత్యవసరంగా పొత్తుపెట్టుకుని ఘోర తప్పిదానికి పాల్పడిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీల అపవిత్రకూటమి చిత్తుగా ఓడిపోవటం ఖాయమని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 200పైగా సీట్లలో గెలుస్తామని, ఈ విషయంలో పార్టీ శ్రేణులకు ఏ మాత్రం సందేహం అక్కర్లేదని, అయితే అంతటి గెలుపును సాధించాలంటే కార్యకర్తలంతా ఇప్పటి నుంచే ఎన్నికల పనులు ప్రారంభించాలని కోరారు. డీఎంకే ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని స్టాలిన్‌ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. లైవ్‌లో పాక్ యాంకర్ కన్నీరు..

Operation Sindoor: 300 విమానాల రద్దు 25 విమానాశ్రయాల మూసివేత

Operation Sindoor: సిందూరమే.. సంహారమై

CM Revanth Reddy: అత్యవసర సర్వీసుల సిబ్బంది సెలవులు రద్దు

బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడి..

Read Latest Telangana News and National News

Updated Date - May 08 , 2025 | 01:21 PM