Share News

Special Court: 23న గైర్హాజరైతే.. ఛార్జిషీట్‌ నమోదు

ABN , Publish Date - May 08 , 2025 | 12:52 PM

ఈ నెల 23న విచారణకు హాజరుకాకపోతే.. ఛార్జిషీటు నమోదు చేస్తామని మంత్రి ఎం. సుబ్రమణ్యంకు ప్రత్యేక కోర్టు మేజిస్ట్రేట్‌ తాఖీదు జారీ చేశారు. ఈ విషయం ఇప్పుడు రాష్ట రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మరి కొద్ది రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కోర్టు ఇచ్చిన తాకీదు చర్చకు దారితీసింది.

Special Court: 23న గైర్హాజరైతే.. ఛార్జిషీట్‌ నమోదు

- మంత్రి సుబ్రమణ్యానికి ప్రత్యేక కోర్టు తాఖీదు

చెన్నై: రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం నగర మేయర్‌గా ఉన్నప్పుడు జరిగిన భూకబ్జా కేసులో ఈ నెల 23న విచారణకు హాజరుకాకపోతే ఛార్జిషీటు నమోదు చేస్తామని ప్రత్యేక కోర్టు మేజిస్ట్రేట్‌ ఆయనకు తాఖీదు జారీ చేశారు. స్థానిక గిండిలోని లేబర్‌ కాలనీలో ఎస్‌కే కన్నన్‌కి కేటాయించిన సిడ్కో సంస్థ స్థలాన్ని సుబ్రమణ్యం నగర మేయర్‌ హోదాలో తన అధికారాన్ని ఉపయోగించి ఆ స్థలాన్ని తన భార్య కాంచన పేరున రాయించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై పార్తిబన్‌ అనే వ్యక్తి 2011లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంత్రి సుబ్రమణ్యం, ఆయన భార్య కాంచన తదితరులపై కేసులు నమోదయ్యాయి.

ఈ వార్తను కూడా చదవండి: Operation Sindoor: రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్‌.. సిద్ధమైన క్షిపణులు..


ఈ కేసులకు సంబంధించిన ఛార్జిషీటును 2019లో అవినీతి నిరోధక శాఖ పోలీసులు దాఖలు చేశారు. ఆ కేసు విచారణ చెన్నై కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులను విచారణ జరిపే ప్రత్యేక కోర్టులో పెండింగ్‌లో ఉండేది. ఆ కేసును రద్దు చేయాలని కోరుతూ మంత్రి సుబ్రమణ్యం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆ పిటిషన్‌ తోసిపుచ్చింది. అంతటితో ఆగకుండా మంత్రిపై దాఖలైన కేసును త్వరగా విచారణ జరపాలంటూ ప్రత్యేక కోర్టుకు ఆదేశాలిచ్చింది. ఇటీవల ప్రత్యేక కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయడం కోసం విచారణకు రమ్మంటూ మంత్రి సుబ్రమణ్యంకు ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది.


ఆ సమయంలో శాసనసభ సమావేశాలు జరుగుతుండటంతో విచారణకు హాజరుకాలేనని ఆయన చెప్పారు. ఈ పరిస్థితులలో ఆ కేసు విచారణ మంగళవారం జరిగినప్పుడు కూడా మంత్రి సుబ్రమణ్యం, ఆయన భార్య కాంచన హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణకు ఆ ఇరువురూ తప్పకుండా హాజరుకావాలని, లేకుంటే అదే రోజున ఏకపక్షంగా ఛార్జిషీటు నమోదవుతుందని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి హెచ్చరించారు. తదుపరి విచారణను ఈ నెల 23న వాయిదా వేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. లైవ్‌లో పాక్ యాంకర్ కన్నీరు..

Operation Sindoor: 300 విమానాల రద్దు 25 విమానాశ్రయాల మూసివేత

Operation Sindoor: సిందూరమే.. సంహారమై

CM Revanth Reddy: అత్యవసర సర్వీసుల సిబ్బంది సెలవులు రద్దు

బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడి..

Read Latest Telangana News and National News

Updated Date - May 08 , 2025 | 12:52 PM