Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 57 నూతన కేంద్రీయ విద్యాలయాలకు ఆమోదం..
ABN , Publish Date - Oct 01 , 2025 | 06:31 PM
ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ (బుధవారం) కేంద్ర కేబినెట్ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో.. నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా.. దేశవ్యాప్తంగా 57 నూతన కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి నాలుగు, ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి కేంద్రం రూ.5,863 కోట్లు కేటాయించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో..
1.ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మంగ సముద్రం,
2.కుప్పం మండలంలోని బైరుగానిపల్లె,
3.శ్రీకాకుళం జిల్లాలోని పలాస,
4.రాజధాని అమరావతిలోని శాఖమూరు
ప్రాంతాల్లో ఈ కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
తెలంగాణ రాష్ట్రంలో..
1.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం(యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్)
2.ములుగు జిల్లా కేంద్రం(గిరిజన ప్రాంతం)
3.జగిత్యాల జిల్లా - రూరల్ మండలం చెల్గల్
4.వనపర్తి జిల్లా - నాగవరం శివార్
ప్రాంతాల్లో విద్యాలయాలను కేంద్రం ఏర్పాటు చేయనుంది. మొదటిసారిగా అన్ని 57 కేంద్రీయ విద్యాలయాలను జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మూడు సంవత్సరాల ప్రాథమిక ప్రీ-ప్రైమరీ తరగతులైన బాల్వటికలను కలిగి ఉంటాయి.
ఇవి కూడా చదవండి..
బిహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ
26/11 దాడుల తర్వాత పాక్‌తో యుద్ధం వద్దని చెప్పిన ఆమెరికా.. చిదంబరం వెల్లడి