Share News

Vote Chori Row: ఓట్ చోరీ వివాదం, సైఫాలజిస్ట్ క్షమాపణ.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన బీజేపీ

ABN , Publish Date - Aug 19 , 2025 | 08:29 PM

సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్)కు చెందిన సైఫాలిజిస్ట్ రెండ్రోజుల క్రితం చేసిన పోస్టులపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ తప్పుడు అభియోగాలకు ఊతమిచ్చేలా నిర్ధారణ కాని డాటాను సీఎస్‌డీఎస్ తీసుకొచ్చిందంటూ విమర్శించింది.

Vote Chori Row: ఓట్ చోరీ వివాదం, సైఫాలజిస్ట్ క్షమాపణ.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన బీజేపీ
Rahul gandhi and Sanjay Kumar

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'ఓట్ చోరీ' జరిగిందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని పలు అసెంబ్లీ నియోజవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో పెరుగుదల, తరుగుదల ఉందంటూ రెండ్రోజుల క్రితం ట్వీట్లు చేసిన సైఫాలజిస్ట్ (Psephologist ) సంజయ్ కుమార్ మంగళవారంనాడు క్షమాపణలు తెలిపారు. తన పోస్టులను తొలగించారు. దీంతో కాంగ్రెస్‌ ఇంతవరకూ చేస్తూ వచ్చిన ఆరోపణలన్నీ తప్పుని రుజువైందంటూ ఆ పార్టీపై బీజేపీ విరుచుపడింది.


సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్)కు చెందిన సైఫాలిజిస్ట్ రెండ్రోజుల క్రితం చేసిన పోస్టులపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ తప్పుడు అభియోగాలకు ఊతమిచ్చేలా నిర్ధారణ కాని డాటాను సీఎస్‌డీఎస్ తీసుకొచ్చిందంటూ విమర్శించింది. ఇదే అదనుగా సంజయ్ కుమార్ చర్యను కాంగ్రెస్ సమర్ధిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలో సంజయ్ కుమార్ అనూహ్యంగా తన పొరపాటుకు క్షమాపణలు తెలియజేశారు. 2024 లోక్‌సభ, 2024 అసెంబ్లీ డాటాను కంపేర్ చేస్తు్న్నప్పుడు పొరపాటు జరిగిందని, తన పొరపాటును క్షమించాలని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన కోరారు. ట్వీట్లను తొలగించానని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే ఉద్దేశం తనకెంత మాత్రం లేదని వివరణ ఇచ్చారు.


ఇప్పుడేమంటారు?

సంజయ్ కుమార్ తన పొరపాటును ఒప్పుకుంటూ ట్వీట్లు తొలగించడంతో ఇప్పుడేమంటారంటూ కాంగ్రెస్‌పై బీజేపీ విరుచుకుపడింది. రాహుల్ గాంధీ ఇప్పటికైనా తన గణాంకాలు తప్పని ఒప్పుకోవాలని బీజేపీ ఐటీ హెడ్ అమిత్ మాలవీయ డిమాండ్ చేశారు. నిజమైన ఓట్లను నకిలీ ఓట్లుగా ముద్ర వేసి ఎన్నికల కమిషన్‌ను టార్గెట్ చేసేంతవరకూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ వెళ్లడం సిగ్గుచేటని అన్నారు.


మహారాష్ట్ర తరహాలోనే బిహార్‌లోనూ ఓట్ చోరీ జరగనుందంటూ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. బిహార్‌లో ఓట్ల ప్రత్యేక సవరణలో లక్షలాది ఓట్లను తొలగించారని, బీజేపీతో కలిసి ఈసీ అవకతవకలకు పాల్పడుతోందని రాహుల్ ఆరోపిస్తున్నారు. అయితే రాహుల్ ఆరోపణలను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఇటీవల మీద్ ద ప్రెస్‌లో తోసిపుచ్చారు. రాహుల్ తన ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని, లేదంటూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లాగా అఫిడవిట్ సమర్పించాలని అల్టిమేటం జారీ చేశారు.


ఇవి కూడా చదవండి..

పోలీసు కానిస్టేబుల్‌ను ఢీకొన్ని రాహుల్ కారు.. వీడియో షేర్ చేసిన బీజేపీ

నెహ్రూ దేశాన్ని రెండు సార్లు విభజించారు.. ప్రధాని మోదీ

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 19 , 2025 | 08:30 PM