BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ డిమాండ్.. పంట రుణాలు మాఫీ చేయాలి
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:45 AM
రాష్ట్రంలోని రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు డీఎంకే ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

- బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై డిమాండ్
చెన్నై: రాష్ట్రంలోని రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు డీఎంకే ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అధికారంలో రావడానికి అలవిగాని హామీలతో ప్రజలను నమ్మించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీఎంకే... ఈ నాలుగేళ్ల పాలనలో హామీలను సక్రమంగా నెరవేర్చలేదన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin), ఆయన మంత్రివర్గం ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని పక్కనబెట్టిందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Veluru: వ్యాన్ బోల్తా.. చెల్లాచెదురైన చేపలు
శాంతిభద్రతలు క్షీణించాయని, మరోవైపు మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోయిందన్నారు. ముఖ్యంగా అత్యాచార ఘటనలు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తొలి సంతకం రైతుల రుణ మాఫీపైనే అని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. దీంతో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇప్పటికైనా రైతు రుణమాఫీపై కమిటీ వేసి చిన్న, సన్నకార రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈవార్తను కూడా చదవండి: Mettuguda: ఇంట్లో తల్లి, తనయుడికి కత్తిపోట్లు
ఈవార్తను కూడా చదవండి: Peddapalli: మొదట పరిషత్ ఎన్నికలకే మొగ్గు
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర
ఈవార్తను కూడా చదవండి: బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Read Latest Telangana News and National News