Veluru: వ్యాన్ బోల్తా.. చెల్లాచెదురైన చేపలు
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:27 AM
వేలూరు జిల్లా అగరంచేరి చెన్నై - బెంగళూరు(Chennai - Bangalore) జాతీయ రహదారిలో గురువారం ఉదయం చేపలలోడు వ్యాన్ టైర్ పంక్చరై బోల్తాపడింది. ఆ వ్యాన్‌నుంచి మేలిమి రకం చేపలన్నీ రోడ్డుపై పడటంతో వాటిని ఏరుకోవడానికి స్థానికులు పోటీపడ్డారు.

- ఏరుకునేందుకు పోటీపడ్డ జనం
చెన్నై: వేలూరు జిల్లా అగరంచేరి చెన్నై - బెంగళూరు(Chennai - Bangalore) జాతీయ రహదారిలో గురువారం ఉదయం చేపలలోడు వ్యాన్ టైర్ పంక్చరై బోల్తాపడింది. ఆ వ్యాన్‌నుంచి మేలిమి రకం చేపలన్నీ రోడ్డుపై పడటంతో వాటిని ఏరుకోవడానికి స్థానికులు పోటీపడ్డారు. నామక్కల్ జిల్లా పళ్ళిపాళయానికి చెందిన నటరాజన్(28) విజయవాడ నుంచి కృష్ణగిరి(Vijayawada to Krishnagiri) రెండు టన్నుల మేలిరకం చేపల పార్శిళ్లను వ్యాన్‌లో ఎక్కించుకుని బయలుదేరాడు.
ఈ వార్తను కూడా చదవండి: అప్పుడే ఎండలు.. సాధారణం కన్నా 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు
గురువారం ఉదయం ఆ వ్యాన్ వేలూరు జిల్లా పళ్ళికొండ సమీపం అగరంచేరి చెన్నై - బెంగళూరు జాతీయ రహదారిలో వెళుతుండగా టైర్ పంక్చరైంది. దీంతో ఆ వ్యాన్ అదుపుతప్పి రోడ్డు మధ్యలో బోల్తాపడింది. వ్యాన్‌లో థర్మాకోల్ పెట్టెల్లో ఉన్న మేలిరకం చేపలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. స్థానికులు గమనించి వెంటనే తమ ఇళ్లకు వెళ్ళి సంచులు, స్టీల్ పాత్రలతో తిరిగొచ్చి రోడ్డుపై పడిన చేపలను జవురుకున్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వెంటనే సోషల్ మీడియా(Social media)లో వెలువడటంతో పళ్ళికొండ పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. చేపలను ఏరుకుంటున్న స్థానికులను తరిమికొట్టారు. ఈ సంఘటన కారణంగా ఆ మార్గంలో గంటకు పైగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈవార్తను కూడా చదవండి: Mettuguda: ఇంట్లో తల్లి, తనయుడికి కత్తిపోట్లు
ఈవార్తను కూడా చదవండి: Peddapalli: మొదట పరిషత్ ఎన్నికలకే మొగ్గు
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర
ఈవార్తను కూడా చదవండి: బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Read Latest Telangana News and National News