Share News

అప్పుడే ఎండలు.. సాధారణం కన్నా 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:09 AM

రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 డిగ్రీలు పెరిగే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాలు సీజన్‌ కన్నా భిన్నంగా జనవరి 26వ తేది వరకు మొత్తం 104 రోజులు కొనసాగాయి.

అప్పుడే ఎండలు.. సాధారణం కన్నా 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు

చెన్నై: రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 డిగ్రీలు పెరిగే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాలు సీజన్‌ కన్నా భిన్నంగా జనవరి 26వ తేది వరకు మొత్తం 104 రోజులు కొనసాగాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిశాయి. అదే సమయంలో, ఈ ఏడాది సీజన్‌కు భిన్నంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 11 గంటల తర్వాత ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది.

ఈ వార్తను కూడా చదవండి: Sabka Saath Sabka Vikas : అందరితో.. అందరి కోసం


ఈ విషయమై ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌(Tamil Nadu, Puducherry, Karaikal) ప్రాంతాల్లో శుక్రవారం నుంచి ఈనెల 11వ తేది వరకు పొడి వాతావరణం నెలకొంటుంది. శుక్ర, శనివారాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరగనున్నాయి. ఉదయం వేళల్లో స్వల్పంగా మంచు కురుస్తోందని, రాజధాని నగరం చెన్నైలో ఆకాశం మేఘావృతంగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది.


ఈవార్తను కూడా చదవండి: Mettuguda: ఇంట్లో తల్లి, తనయుడికి కత్తిపోట్లు

ఈవార్తను కూడా చదవండి: Peddapalli: మొదట పరిషత్‌ ఎన్నికలకే మొగ్గు

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర

ఈవార్తను కూడా చదవండి: బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 07 , 2025 | 11:09 AM