Share News

West Bengal : బీజేపీ నేతపై దాడి.. ఉద్రిక్తత..

ABN , Publish Date - Aug 05 , 2025 | 02:57 PM

పశ్చిమబెంగాల్‌లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ నేత సువేందు అధికారి కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

West Bengal : బీజేపీ నేతపై దాడి.. ఉద్రిక్తత..

ఇంటర్నెట్‌డెస్క్‌ : పశ్చిమబెంగాల్‌లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ నేత సువేందు అధికారి కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇవాళ(మంగళవారం) కూచ్ బిహార్‌లో కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది.


ర్యాలీ జరుగుతున్న సమయంలో.. కొందరు దుండగులు సువేందు అధికారి(Suvendu Adhikari) కాన్వాయ్‌పై రాళ్లు విసిరారు. గత కొంత కాలంగా బీజేపీ(BJP) నాయకులపై జరుగుతున్న దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నివేదికలను పోలీసులుకు అందజేయడానికి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరగటం గమనార్హం. అయితే.. దాడి సమయంలో అధికార పక్షానికి చెందిన నేతలు ఇక్కడ నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.


ఇవి కూడా చదవండి..

ఎర్రకోటలో భద్రతా వైఫల్యం.. ఏడుగురు పోలీసుల సస్పెన్షన్

బరి తెగిస్తున్న కేటుగాళ్లు.. దేవుళ్లను కూడా వదలటం లేదు...

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 05 , 2025 | 03:04 PM