Milkipur Bypoll: మిల్కిపూర్ బై పోల్ ఫలితాల్లో కూడా బీజేపీ ఆధిక్యం.. ఎస్పీకి షాక్..
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:56 AM
ఓ వైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న బీజేపీ.. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్ స్థానంలో కూడా ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. అయితే ఈ ప్రాంతంలో బీజేపీ ఎంత మేరకు ఆధిక్యంలో ఉందనే వివరాలను ఇక్కడ చూద్దాం.

బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనే కాదు, ఇటు యూపీ అయోధ్య జిల్లాలోని మిల్కిపూర్ బై పోల్ (Milkipur Bypoll2025) ఫలితాల్లో కూడా పాజిటివ్ ధోరణితో కొనసాగుతోంది. ఉదయం నుంచి కూడా ఈ ఉప ఎన్నికలో బీజేపీకి చెందిన చంద్రభాను పాశ్వాన్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అజిత్ ప్రసాద్‌పై ఆధిక్యంలో ఉన్నారు. మిల్కిపూర్‌లో బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాస్వాన్ ప్రస్తుతం మొత్తం 69,456 ఓట్లతో ముందంజలో ఉండగా, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అజిత్ ప్రసాద్ మొత్తం 32,592 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఈ క్రమంలో పాస్వాన్ 32,864 ఓట్ల మెజారిటీ సాధించారు.
ఈ ఫలితాలపై లోక్‌సభ ఎన్నికల తర్వాత సమాజ్‌వాదీ పార్టీ అహంకార పతనానికి ఇది నిదర్శనమని బీజేపీ ఎంపీ దినేష్ శర్మ అన్నారు. వారు ఓటమిని ప్రజాస్వామ్యబద్ధంగా అంగీకరించాలన్నారు. ఈ ఫలితాల నేపథ్యంలో చంద్రభాను పాశ్వాన్ అయోధ్యలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తమ పార్టీకి మంచి మద్దతు ఇచ్చినందుకు మిల్కిపూర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇంకా మిల్కిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి గెలుస్తారని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు.
మరోవైపు సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ కూడా మిల్కిపూర్ ఎన్నికలపై స్పందించారు. బీజేపీ గూండాలు బూత్‌లను స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. కానీ ఎన్నికల కమిషన్ ఏం చేయలేదన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఇప్పటికే అనేక ఫిర్యాదులు చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ బీజేపీ ఓడిపోతుందని, ఎస్పీ అభ్యర్థి గెలుస్తారని ఫైజాబాద్ ఎంపీ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచి ఎస్పీ నుంచి ఎంపీగా ఎన్నికైన తర్వాత అవధేష్ ప్రసాద్ మిల్కిపూర్ స్థానానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి ఫిబ్రవరి 5న ఉప ఎన్నిక జరిగింది. దాదాపు 65 శాతం పోలింగ్ జరిగింది.
ఇవి కూడా చదవండి:
Omar Abdullah: ఇంకా బాగా కొట్టుకోండి.. ఇండియా కూటమిపై ఒమర్ అబ్దుల్లా ట్వీట్
AAP vs BJP: ఆప్ నాలుగోసారి గెలుస్తుందా లేదా బీజేపీ కైవసం చేసుకుంటుందా..
Delhi Election Results 2025: నేటి ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఫస్ట్ ప్రకటించేది ఇక్కడే.. చివరగా..
Gold and Silver Rates Today: పైపైకి పసిడి, వెండి రేట్లు.. ఎంతకు చేరాయంటే..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News