Sabarimala: శబరిమల భక్తులు అటువైపు వెళ్లకండి.. అటవీ శాఖ కీలక సూచన
ABN , Publish Date - Dec 09 , 2025 | 08:26 PM
సన్నిధానానికి అటవీ మార్గం గుండా వెళ్తే భక్తులు ఉరక్కుళి జలపాతం వద్ద స్నానం చేసి స్వా్మిని దర్శించుకుంటారని, పండితావళానికి సుమారు 400 మీటర్ల దూరంలోని ఈ జలపాతం వద్ద తరచు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని బాలకృష్ణన్ తెలిపారు.
తిరువనంతపురం: అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల వెళ్లే భక్తులకు కేరళ అటవీ శాఖ అధికారులు మంగళవారంనాడు కీలక సూచనలు చేశారు. సన్నిధానానికి సమీపంలోని ఉరుక్కుళి జలపాతాన్ని సందర్శించవద్దని సూచించారు. వన్యప్రాణుల నుంచి ముప్పు పొంచి ఉండటం, తరచు ప్రమాదాలు జరుగుతుండటంతో ఈ సూచనలు చేసింది. ఈ మేరకు సన్నిధానం స్పెషల్ డ్యూటీ రేంజ్ అధికారి అరవింద్ బాలకృష్ణన్ ఒక అడ్వయిజరీ జారీ చేశారు.
సన్నిధానానికి అటవీ మార్గం గుండా వెళ్తే భక్తులు ఉరక్కుళి జలపాతం వద్ద స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారని, పండితావళానికి సుమారు 400 మీటర్ల దూరంలోని ఈ జలపాతం వద్ద తరచు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని బాలకృష్ణన్ తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద ఈ ప్రాంతంలోకి ప్రవేశం నిషిద్ధమని చెప్పారు. ఇటీవల తరచు ఇక్కడ ప్రమాదాలు చోటుచేసుకోవడంతో పాటు ఏనుగుల గుంపు సంచరిస్తోందని, దీంతో ప్రమాదావకాశాలు రెట్టింపయ్యాయని చెప్పారు. జలపాతానికి వెళ్లే మార్గం కూడా జారుడుగా ఉండటంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. శబరిమలకు వచ్చే భక్తుల భద్రత తమకు చాలా కీలకమని, భక్తులు సహకరించి, భద్రతా సూచనలను పాటించాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
మోదీతో సత్యనాదెళ్ల భేటీ.. భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
ఆర్ఎస్ఎస్ ఎజెండాను ప్రభుత్వం అమలు చేస్తోంది... ఎస్ఐఆర్‌పై చర్చలో రాహుల్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి