Microsoft CEO meets with PM Modi: మోదీతో సత్యనాదెళ్ల భేటీ.. భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Dec 09 , 2025 | 06:55 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సత్యనాదెళ్ల.
ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)తో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల(Microsoft CEO Satya Nadella) భేటీ అయ్యారు. ఈ మేరకు ఇండియాలో 17.5 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.1.5 లక్షల కోట్లు) పెట్టుబడికి హామీ ఇచ్చారు సత్య నాదెళ్ల. దేశంలో కృత్రిమ మేథ(AI) సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. కాగా, ఆసియా(Asia)లో మైక్రోసాఫ్ట్ తరఫున ఇదే అతిపెద్ద పెట్టుబడి అని అమెరికా సాఫ్ట్‌వేర్ దిగ్గజం పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారాయన.
'భారతదేశంలో ఏఐ అవకాశాల కోసం ఆహ్వానించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. దేశ ఆశయాలకు మద్దతుగా మైక్రోసాఫ్ట్ 17.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఆసియాలో ఇప్పటివరకూ ఇదే అత్యధికం. దేశంలో ఏఐ మొదటి తరానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సామర్థ్యాల ఏర్పాటుకు తోడ్పడుతుంది' అని సత్యనాదెళ్ల చెప్పారు.
సత్యనాదెళ్లతో భేటీ అవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఏఐ పరంగా.. ప్రపంచం ఇండియా పట్ల ఆశాజనకంగా ఉందన్న ఆయన.. సత్యనాదెళ్లతో దీనిపై మంచి చర్చ జరిగిందన్నారు. మైక్రోసాఫ్ట్ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశంలోని యువత మెరుగైన ఏఐ ఆవిష్కణలు చేస్తుందని ఎక్స్ వేదికగా స్పందించారు మోదీ.
ఇవీ చదవండి: