Modi: అటల్ బిహారీ వాజ్‌పేయికి ప్రముఖుల ఘన నివాళులు
ABN , Publish Date - Dec 25 , 2025 | 10:13 AM
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి 101వ జయంతి ఇవాళ. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఉదయాన్నే ఢిల్లీలోని ఆయన సమాధి దగ్గర రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు..
న్యూఢిల్లీ, డిసెంబర్ 25: భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి (డిసెంబర్ 25, 2025) సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి 'సదైవ్ అటల్' వద్ద ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ, 'వాజ్‌పేయి పాలన జాతి అభివృద్ధికి దివిటీలా పనిచేస్తోంది. ఆయన ఆదర్శాలు, మంచి పాలన స్ఫూర్తి దేశ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయి' అని పేర్కొన్నారు. అటల్ జీ జీవితం స్వచ్ఛమైన నాయకత్వం, దేశభక్తికి ప్రతీక అని కొనియాడారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు కూడా నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా అటల్ జయంతిని 'సుశాసన దివస్'గా జరుపుకుంటున్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ఆదర్శాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని నాయకులు కీర్తించారు.
ఇవి కూడా చదవండి..
2 రోజుల్లోనే అలర్జీ వచ్చింది.. ఢిల్లీ వాయి కాలుష్యంపై నితిన్ గడ్కరి కీలక వ్యాఖ్యలు
నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి