Share News

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. కొనసాగుతోన్న కూంబింగ్

ABN , Publish Date - Mar 03 , 2025 | 09:10 PM

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోన్నట్లు సమాచారం.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. కొనసాగుతోన్న కూంబింగ్

రాయ్‌పూర్, మార్చి 03: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ధామ్‌తారి జిల్లాలో ఖల్లారి పోలీస్ స్టేషన్ పరధిలోని మాదగిరి అడువుల్లో సోమవారం ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అయితే ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోన్నట్లు తెలుస్తోంది. సదరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారంటూ భద్రత దళాలకు సమాచారం అందిందింది.

ఈ సమావేశంలో భారీగా మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలియడంతో.. భద్రత సిబ్బంది సదరు అటవీ ప్రాంతానికి చేరుకుని కూంబింగ్ నిర్వహించారు. ఈ విషయాన్ని పసిగట్టిన మావోయిస్టులు వెంటనే స్పందించి.. భద్రతా దళాలపైకి కాల్పులకు తెగబడ్డాయి. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి.. ఎదురు కాల్పులకు దిగారు. ఈ నేపథ్యంలో ఇరు వైపులా హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ క్రమంలో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈ కూంబింగ్ ఆపరేషన్‌లో మావోయిస్టులకు చెందిన శిబిరాన్ని భద్రతా దళాలు ధ్వంసం చేశాయి.

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: చిట్‌ఫండ్స్ బాధితులను ఆదుకొనే దిశగా చర్యలు

Also Read : ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

Also Read: సీఎం మార్పు తథ్యం.. ఎప్పటి లోగా అంటే..

Also Read: ఈ పని చేస్తే.. ప్రభుత్వ పథకాలు ఫట్

Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్

Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..

For National News And Telugu News

Updated Date - Mar 03 , 2025 | 09:12 PM