Assembly elections: డీఎంకేను గద్దె దింపేందుకే బీజేపీతో పొత్తు
ABN , Publish Date - Aug 27 , 2025 | 10:10 AM
డీఎంకేను అధికారం నుండి ఇంటికి సాగనంపేందుకే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నట్లు మాజీసీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంలో గత నెల 7వ తేదీన కోవై మేట్టుపాళయంలో ప్రారంభించిన ఈపీఎస్ ప్రచారయాత్ర మంగళవారం తిరుచ్చి జిల్లా శ్రీరంగం చేరుకుంది.
- ఎడప్పాడి పళనిస్వామి
చెన్నై: డీఎంకేను అధికారం నుండి ఇంటికి సాగనంపేందుకే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నట్లు మాజీసీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంలో గత నెల 7వ తేదీన కోవై మేట్టుపాళయంలో ప్రారంభించిన ఈపీఎస్ ప్రచారయాత్ర మంగళవారం తిరుచ్చి జిల్లా శ్రీరంగం చేరుకుంది.
రంగనాథస్వామి ఆలయ రాజగోపురం సమీపంలో ఈపీఎస్ మాట్లాడుతూ, ఆచరణలకు సాధ్యంకాని హామీలతో రాష్ట్రప్రజలను మభ్యపెట్టి డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 51 నెలలు దాటిందని, అయినా శ్రీరంగం నియోజకవర్గం మాత్రం అభివృద్ధిలో వెనుబడివుందని ఆరోపించారు. భారతదేశంలో ప్రముఖ వైష్ణవక్షేత్రమైన శ్రీరంగానికి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు పథకాలు అమలుచేసి అభివృద్ధి తోడ్పడి, ఇక్కడున్న గ్రామాలను నగరాలుగా మార్చారని తెలిపారు. దేశంలోనే ఉన్నత విద్యలో తమిళనాడు అగ్రస్థానంలో ఉన్నదని 2019లోనే కేంద్రప్రభుత్వం అధికారపూర్వకంగా ప్రకటించిందన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, అధికార వర్గ నేతల అండదండలతో నామక్కల్‌లోని ఓ ఆస్పత్రి యాజమాన్యం పేద కార్మికుల కిడ్నీలను దొంగిలించి ఆర్థికంగా లబ్దిపొందుతున్న వ్యవహారంపై సీఎం స్టాలిన్ ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. డీఎంకే సమయానికి తగ్గట్టుగా కూటమిని ఏర్పాటు చేసుకుంటుందని, 1999, 2001లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో చేరి కేంద్రమంత్రి వర్గంలో భాగస్వామ్యం వహించిందని, ఆ సమయంలో బీజేపీని డీఎంకే నేతలు మంచి పార్టీ అని పోగడ్తలతో ముంచెత్తారని, అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు కుదుర్చుకోవడంపై డీఎంకే విమర్శించడం న్యాయం కాదని ఈపీఎస్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి ఉత్తమ్‌కు హరీష్ రావు సంచలన లేఖ
Read Latest Telangana News and National News