Share News

Edi Rama welcomes Meloni: ఆ దేశాధినేత స్వాగతానికి మెలోని ఖుషీ.. వీడియో వైరల్..

ABN , Publish Date - May 17 , 2025 | 10:54 AM

అల్బేనియా రాజధాని టిరానాలో ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు యూరోపియన్‌ యూనియన్‌ దేశాల నేతలంతా హాజరయ్యారు. వారందరికీ అల్బేనియా దేశాధినేత ఎడీ రమా ఘన స్వాగతం పలికారు. అయితే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి స్వాగతం చెప్పిన తీరు చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

Edi Rama welcomes Meloni: ఆ దేశాధినేత స్వాగతానికి మెలోని ఖుషీ.. వీడియో వైరల్..

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి.. అల్బేనియా దేశాధినేత స్వాగతం పలికిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. అల్బేనియా రాజధాని టిరానాలో ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు యూరోపియన్‌ యూనియన్‌ దేశాల నేతలంతా హాజరయ్యారు. వారందరికీ అల్బేనియా దేశాధినేత ఎడీ రమా ఘన స్వాగతం పలికారు. అయితే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి స్వాగతం చెప్పిన తీరు చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సదస్సుకు హాజరైన జార్జియా మెలోనీ.. కారు దిగి రెడ్ కార్పెట్‌పై నడుస్తూ వస్తుండగా.. ఎదురుగా అల్బేనియా దేశాధినేత.. ఆమెకు స్వాగతం పలికేందుకు వస్తున్నాడు.


అయితే మధ్యలో ఆయన ఉన్నట్టుండీ మోకాళ్లపై నిలబడి, చేతులు జోడించి నమస్కారం చేస్తూ స్వాగతించారు. ఎడీ ఆహ్వానానికి ఇటలీ ప్రధాని (Italian Prime Minister Giorgia Meloni) ఖుషీ అయిపోయారు. ఆ వెంటనే ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ సమయంలో ఓ వైపు వర్షం పడుతోంది. అయినా ఎడీ (Albanian President Edi Rama) .. ఎంతో ఓపిగ్గా అందరికీ దగ్గరుండి మరీ స్వాగతం పలికారు. అనంతరం యూరప్ నాయకులకు ఆతిథ్యం కూడా ఇచ్చారు.


అల్బేనియా దేశాధినేత ఎడీ ఇలా వినూత్నంగా ఆహ్వానించడం ఇది కొత్తేం కాదు. ఈ ఏడాది జనవరిలో మెనోనీ పుట్టిన రోజు సందర్భంగా ఓ సదస్సులో కలిసిన అల్బేనియా దేశాధినేత ఎడీ .. మోకాళ్లపై కూర్చుని స్వాగతం పలకడమే కాకుండా ఆమెకు స్కార్ఫ్‌ను కానుకగా కూడా ఇచ్చారు. జార్జియా మెలోనీని తన ‘‘ఇటాలియన్‌ సిస్టర్‌’’.. అని ఎడీ రమా పలు సందర్భాల్లో గుర్తు చేశారు.


ఈ కార్యక్రమం అనంతరం ఎడీ రమా మీడియాతో మాట్లాడుతూ తాను అందరిలో ఎత్తైన వాడినని, కానీ అతి చిన్న దేశానికి నాయకత్వం వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈ శికరాగ్ర సమావేశాన్ని నిర్వహించే అవకాశం దక్కడం పెద్ద గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఎడీ రమా ఇటలీ ప్రధానికి స్వాగతం చెప్పిన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 11:17 AM