Delhi Assembly Elections: సీఎం ఇంటికి పోలీసులు
ABN , Publish Date - Jan 30 , 2025 | 09:20 PM
Delhi Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరి కొద్ది రోజులే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి.

న్యూఢిల్లీ, జనవరి 30: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరికొద్ది రోజులే గడువు ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ, ఆప్‌ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఆ క్రమంలో ఈ రెండు పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకొంటున్నాయి. అలాంటి వేళ.. గురువారం న్యూఢిల్లీలోని ఆప్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ అధికారిక నివాసం కపుర్తల హౌస్‌కు భారీ ఎత్తున పోలీసులు చేరుకున్నారు. దీంతో సీఎం భగవంత్ సింగ్ మాన్ నివాసంలో సోదాలు నిర్వహించేందుకు వచ్చారంటూ ఆప్ నేతలు ఆరోపించారు. అయితే ఆప్ నేతల ఆరోపణలను పోలీసులు ఖండించారు.
ఇంతకు ఏం జరిగిందంటే..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్. ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఆప్ నేతలు నగదు పంచుతున్నారంటూ ఎన్నికల సంఘానికి సి విజిల్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు అందింది. దీంతో ఈ ఫిర్యాదును దర్యాప్తు చేయడానికి రిటర్నింగ్ ఆఫీసర్ నేతృత్వంలోని బృందం కపుర్తలా హౌస్‌కు చేరుకుందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
సి-విజిల్ పోర్టల్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులను దాఖలు చేయడానికి ప్రజలను అనుమతిస్తుంది. వీటిని 100 గంటల్లో ధృవీకరించి పరిష్కరిస్తారు. అయితే భారీగా పోలీసులు సీఎం నివాసానికి చేరుకున్నప్పటికి.. అక్కడి భద్రతా సిబ్బంది మాత్రం లోనికి అనుమతించ లేదని పోలీస్ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది.
Also Read: కేజ్రీవాల్ ఇరికించాలనుకొని.. ఇరుక్కుపోయారా?
Also Read: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
పంజాబ్ సీఎం నివాసంలో సోదాలు నిర్వహించేందుకు వచ్చారంటూ ఆరోపించింది. ఈ మేరకు ఢిల్లీ సీఎం అతిషి.. తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. సీఎం నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించేందుకు వచ్చారన్నారు. కానీ బీజేపీ నేతలు చేసిన తప్పులను మాత్రం వారు పట్టించుకోవడం లేదన్నారు. పట్టపగలే బీజేపీ నేతలు ప్రజలకు నగదు పంచేందుకు వెళ్తున్నారని చెప్పారు. అయినాప్పటికీ ప్రజలు ఎన్నుకొన్న నాయకుడు సీఎం మాన్ సింగ్ ఇంటిపై రైడ్ చేసేందుకు వచ్చారంటూ అతిషి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ
Also Read: జియో సిమ్ వాడుతున్నారా.. ఆ రెండు ప్లాన్స్ గోవిందా..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ తరఫున సమాజా వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శతృఘ్న సిన్హా ప్రచారం నిర్వహిస్తున్నారు. అదీకాక ఎన్నికల పోలింగ్ సమీపించడంతో.. రాజకీయ పార్టీల నేతలు.. తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Also Read: హెలికాప్టర్, విమానం ఢీ.. 28 మృతదేహాలు వెలికితీత
Also Read: నెలల తరబడి ఇంటికి వెళ్లని ఆ ఉద్యోగులు.. రిలీజ్ ఎప్పుడంటే..?
For National News And Telugu News