-
-
Home » Mukhyaamshalu » Today Latest Viral Trending Breaking ABN Andhra Jyothy news across world 23rd october 2025 kjr
-
BREAKING: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
ABN , First Publish Date - Oct 23 , 2025 | 07:41 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 23, 2025 18:02 IST
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు..
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం
పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగింపునకు ఆమోదం
-
Oct 23, 2025 17:05 IST
UAE: అబుదాబిలో ఏపీ సీఎం చంద్రబాబు
అబుదాబి చాంబర్ చైర్మన్ అలీ జాబీతో పాటు..
G-42 సీఈవో మున్సూర్ అల్‌తో చంద్రబాబు భేటీ
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పనిచేస్తోందన్న చంద్రబాబు
అమరావతిలో అందుబాటులోకి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు: చంద్రబాబు
కొత్త అవకాశాలు, ఇన్నోవేషన్‌కు కేంద్రంగా అమరావతి: చంద్రబాబు
విశాఖలో CII సదస్సుకు హాజరుకావాలని కోరిన సీఎం చంద్రబాబు
ఏపీలో పర్యటించి పెట్టుబడులపై ఆలోచిస్తామని చెప్పిన ప్రతినిధులు
-
Oct 23, 2025 17:05 IST
కామారెడ్డి: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌ను కలిశా: పోచారం
సీఎం రేవంత్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు: పోచారం శ్రీనివాస్‌రెడ్డి
అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే.. రాజకీయం చేస్తున్నారు: పోచారం
నా నిర్ణయం తప్పు అయితే చెప్పు తీసుకుని కొట్టండి: పోచారం
-
Oct 23, 2025 17:05 IST
హన్మకొండ: నయీంనగర్ తేజస్వి హైస్కూల్‌లో మరో విద్యార్థి మృతి
నాలుగో తరగతి విద్యార్థి సుర్జిత్ ప్రేమ్ అనుమానాస్పద మృతి
స్కూల్ ఎదుట బాలుడి తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన
గేటుకు తాళం వేసి పరారైన స్కూల్ యాజమాన్యం
నెల కిందట తేజస్వి హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థి మృతి
-
Oct 23, 2025 11:51 IST
బాలికపై అత్యాచారం.. నిందితుల అరెస్ట్..
రాజమండ్రి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన రాజమండ్రి టూటౌన్ పోలీసులు
నిందితులు జొన్నాడకు చెందిన అజయ్, అతని స్నేహితుడు రావులపాడుకు చెందిన స్వామిని
24 గంటల్లోనే అరెస్ట్ చేసిన పోలీసులు..
నిందితులపై అపహరణ, అత్యాచారం, పోక్స్ కేసు నమోదు చేసిన పోలీసులు
మరికొద్ది సేపట్టో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు.
-
Oct 23, 2025 11:27 IST
భారీగా గంజాయి స్వాధీనం
హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం
గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు
నిందితులు వద్ద నుంచి 2.4 కోట్ల విలువైన 890 కిలోల డ్రై గంజాయి స్వాధీనం
నేడు మధ్యాహ్నం 1 గంటకి మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించనున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ఎస్.చైతన్య కుమార్
-
Oct 23, 2025 10:16 IST
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం
కృష్ణా, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో వర్షం
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం
వర్షం కారణంగా కాల్వలను తలపిస్తున్న ప్రధాన రహదారులు
గుంటూరులో 3 వంతెనలు, కంకరగుంట అండర్ పాస్‌లోకి చేరిన నీరు
-
Oct 23, 2025 10:08 IST
పీఈటీ టీచర్‌పై దాడి
భూపాలపల్లిలో పీఈటీ టీచర్‌పై భజరంగ్‌దళ్, ABVP నేతల దాడి
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పీఈటీ టీచర్‌పై ఆరోపణ
ఓ ప్రైవేటీ పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ టీచర్
-
Oct 23, 2025 09:28 IST
కాల్పుల కేసులో పోలీసుల పురోగతి..
పోచారం కాల్పుల కేసులో రాచకొండ పోలీసుల పురోగతి..
హైదరాబాద్ పోచారం కాల్పుల కేసులో రాచకొండ పోలీసుల పురోగతి..
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు, పరారీలో మరో నిందితుడు..
నేడు ఉదయం 11:30 గంటలకు నిందితుల్ని మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్న పోలీసులు
మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించునున్న రాచకొండ సీపీ సుధీర్ బాబు
గడిచిన 10 రోజుల్లో నాలుగు సార్లు ఇబ్రహీం గోవులను పట్టుకున్న ప్రశాంత్ అలియాస్ సోను సింగ్..
శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా మాట్లాడుకుందామని ప్రశాంత్‌ని పిలిపించిన ఇబ్రహీం...
మాటామాటా పెరిగి ప్రశాంత్‌పై కాల్పులు జరిపిన ఇబ్రహీం
-
Oct 23, 2025 08:54 IST
ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం
ఢిల్లీలోని రోహిణిలో ఎన్‌కౌంటర్
ఎన్‌కౌంటర్‌లో బీహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతం
హతుల్లో గ్యాంగ్ లీడర్ రంజన్ పాఠక్.
ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ -బీహార్ పోలీసుల జాయింట్ ఆపరేషన్
-
Oct 23, 2025 08:47 IST
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు..
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు..
వర్షాల కారణంగా ఈరోజు కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించిన జిల్లా యంత్రాంగం.
ఎన్టీఆర్, కృష్ణాపురం జలాశయాలకు పెరుగుతున్న వరద నీరు.
ఎన్టీఆర్ జలాశయంలో నాలుగు గేట్లు ఎత్తి నీటిని బయటకు వదులుతున్న అధికారులు.
కృష్ణాపురం జలాశయంలో రెండు గేట్లు ఎత్తి నీటిని బయటకు వదులుతున్న అధికారులు.
జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 100% నిండిన 600 చెరువులు.
భారీగా వరద నీరుతో ప్రవహిస్తున్న గార్గేయ, నివా నదులు.
ఉదయం నుంచి అక్కడక్కడ కురుస్తున్న చిరుజల్లులు.
పలు మండలాల్లో వరి పంటకు వాటిల్లిన నష్టం, కోతలకు గురైన రోడ్లు.
జలమయంగా మారిన పల్లపు ప్రాంతాలు.
-
Oct 23, 2025 07:55 IST
స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు కీలక నిర్ణయం
బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు కీలక నిర్ణయం
మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం..
బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై న్యాయ నిపుణులు ఇచ్చిన నివేదికపై చర్చించనున్న కేబినెట్..
స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం.
SLBC టన్నెల్ పనుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోనున్న మంత్రి మండలి..
SRSP -స్టేజ్ 2కు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు ఖరారుకు ఆమోదం..
కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల డిజైన్ టెండర్లపై చర్చించే అవకాశం..
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం ,మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ సహా పంచాయతీ, ఆర్ అండ్ బీ శాఖకు చెందిన పలు అంశాలపై కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేబినెట్