-
-
Home » Mukhyaamshalu » today latest viral trending and Breaking ABN Andhra Jyothy news across globe 16Th oct 2025 kjr
-
BREAKING: ఏపీ పర్యటన.. మోదీ ఆసక్తికర ట్వీట్..
ABN , First Publish Date - Oct 16 , 2025 | 06:03 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 16, 2025 19:50 IST
కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం
జయశంకర్ వర్సిటీకి 3 కొత్త వ్యవసాయ కాలేజీలకు కేబినెట్ ఆమోదం
నల్లగొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో వ్యవసాయ కాలేజీలు
-
Oct 16, 2025 19:49 IST
ఏపీలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉంది: Xలో ప్రధాని మోదీ
పరిశ్రమలను బలోపేతం చేసి పౌరులను శక్తిమంతం చేసేలా అనేక ప్రాజెక్టులు: Xలో మోదీ
ఏపీ కనెక్టివిటీని పెంచే కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణం: మోదీ
శ్రీశైలం మల్లన్న ఆశీర్వాదం పొందడం అదృష్టంగా భావిస్తున్నా: మోదీ
ఏపీ స్వాభిమాన సంస్కృతి భూమి.. విజ్ఞాన ఆవిష్కరణల కేంద్రం కూడా
స్వచ్ఛశక్తి నుంచి సంపూర్ణ శక్తి ఉత్పత్తి వరకు..
భారత్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది: Xలో ప్రధాని మోదీ
-
Oct 16, 2025 19:49 IST
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
రెండేళ్ల పాలన పూర్తి సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు కేబినెట్ నిర్ణయం
డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు
నల్లగొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో వ్యవసాయ కాలేజీలు
R&B హ్యామ్ రోడ్లకు కేబినెట్ ఆమోదం
-
Oct 16, 2025 19:49 IST
హైదరాబాద్: మీనాక్షి నటరాజన్‌ను కలిసిన కొండా సురేఖ
నటరాజన్‌కు నేను చెప్పాల్సింది చెప్పాను: మంత్రి సురేఖ
పార్టీ పెద్దలకు కూడా జరుగుతున్న విషయాలు చెప్పాను: మంత్రి సురేఖ
విచారణ జరిపి త్వరలో నిర్ణయం చెబుతామని పెద్దలు చెప్పారు: మంత్రి సురేఖ
పార్టీ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటా: కొండా సురేఖ
-
Oct 16, 2025 16:57 IST
దసపల్లా హోటల్స్ కు గ్రీన్ సిగ్నల్..
ఏపీలో 4 స్టార్ దసపల్లా హోటల్స్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి
రూ.200 కోట్లతో 4 స్టార్ దసపల్లా హోటల్స్ నిర్మాణం
దసపల్లా హోటల్స్ నిర్మాణంతో 400 మందికి ఉపాధి అవకాశాలు
-
Oct 16, 2025 16:42 IST
మంత్రులంతా రాజీనామా..
గుజరాత్ కేబినెట్‌లోని మంత్రులంతా రాజీనామా
కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న సీఎం భూపేంద్ర పటేల్
మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేయనున్న సీఎం భూపేంద్ర
-
Oct 16, 2025 15:50 IST
రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు
కర్నూలులో రూ.2,086 కోట్లతో విద్యుత్ ప్రాజెక్టులు
ఓర్వకల్లులో రూ.2,786 కోట్లతో పారిశ్రామిక కేంద్రం
కడప జిల్లా కొప్పర్తిలో రూ.2,136 కోట్లతో పారిశ్రామిక కేంద్రం
రూ.677 కోట్లతో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులు
రూ.964 కోట్లతో సబ్బవరం-షీలానగర్ రోడ్డుకు ప్రారంభోత్సవం
రూ.1,142 కోట్లతో చేపట్టిన సిక్స్ లేన్ రోడ్డు ప్రాజెక్టులు
కృష్ణా జిల్లా నిమ్మకూరులో రూ.362 కోట్లతో చేపట్టిన రక్షణ పరికరాల ఉత్పత్తి ప్రాజెక్ట్
కర్నూలు నుంచి జాతీయ గ్రిడ్‌కు పునరుత్పాదక విద్యుత్ సరఫరా, అనుసంధానం
కొత్తవలస-విజయనగరం మధ్య నాలుగో రైల్వే లైన్
పెందుర్తి-సింహాచలం నార్త్ స్టేషన్ల మధ్య రైల్వే బ్రిడ్జి
-
Oct 16, 2025 15:12 IST
MLA ప్రేమ్‌సాగర్‌కు చికిత్స..
హైదరాబాద్: గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో MLA ప్రేమ్‌సాగర్‌కు చికిత్స
ప్రేమ్‌సాగర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క
-
Oct 16, 2025 15:12 IST
కొడంగల్ బంద్‌కు పిలుపు..
కొడంగల్ బంద్‌కు కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ కార్యాచరణ కమిటీ పిలుపు
వ్యాపారుల సంపూర్ణ మద్దతు, అఖిలపక్ష నేతలతో కలిసి ర్యాలీ నిర్వహణ
అప్పాయిపల్లిలో తలపెట్టిన వైద్య కళాశాలను తరలించవద్దని డిమాండ్
-
Oct 16, 2025 15:00 IST
సైబర్ నేరగాళ్ల టోకరా
ముంబై వ్యాపారికి సైబర్ నేరగాళ్ల టోకరా
డిజిటల్ అరెస్ట్ పేరిట రూ.58 కోట్ల స్వాహా
-
Oct 16, 2025 14:59 IST
హైదరాబాద్: ఓటు చోరీపై హైకోర్టులో BRS పిటిషన్
లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన BRS
BRS తరఫున న్యాయవాది దామా శేషాద్రి వాదనలు
జూబ్లీహిల్స్‌లో ఓటు చోరీ జరిగిందని వాదనలు
-
Oct 16, 2025 14:58 IST
భద్రాద్రి: గుండెపోటుతో కండక్టర్ కన్నుమూత
దుమ్ముగూడెం మండలం ముల్కపాడులో ఘటన
భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్తున్న RTC బస్సు
-
Oct 16, 2025 13:53 IST
నవంబర్ 2 నుంచి 5 వరకు సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన
రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా లండన్ లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
నవంబర్ 14,15 లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సు
లండన్ లో పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్న సీఎం
విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని పారిశ్రామిక వేత్తలను కోరనున్న సీఎం
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలను పారిశ్రామిక వేత్తలకు వివరించనున్న సీఎం
సీఎంతో పాటు లండన్ వెళ్లనున్న సీఎం కార్యదర్శి కార్తికేయమిశ్ర
ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన జీఎడీ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
-
Oct 16, 2025 13:30 IST
తెలంగాణ హైకోర్టులో కేటీఆర్, మాగంటి సునీత లంచ్ మోషన్ పిటిషన్
బోగస్ ఓట్లపై ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోవడం లేదని పిటిషన్
బోగస్ ఓట్లు డిలీట్ చేసేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్
-
Oct 16, 2025 13:29 IST
హైదరాబాద్: డెక్కన్ హోటల్ కూల్చివేతపై నాంపల్లి కోర్టులో విచారణ
పర్సనల్ బాండ్ సమర్పించేందుకు నవంబర్ 14న వెంకటేష్, రానా,..
అభిరామ్, సురేష్‌బాబు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశం
-
Oct 16, 2025 13:29 IST
మ.3గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం
బీసీ రిజర్వేషన్ల అంశంలో సుప్రీం తీర్పుపై చర్చించనున్న కేబినెట్
పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించే అంశంపై చర్చ
-
Oct 16, 2025 13:15 IST
మోదీ హామీ అంటూ ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ కౌంటర్
వినియోగదారుల ప్రయోజనాల మేరకే ఇంధన ఎంపికల్లో ప్రాధాన్యత: భారత్
స్థిరమైన ఇంధన ధరలు, సురక్షితమైన సరఫరాలు నిర్ధారించడమే మా లక్ష్యం: భారత్
భారత ఆర్థిక వ్యవస్థకు మా చమురు కీలకం: రష్యా
భారత్-అమెరికా సంబంధాల్లో తాము ఎలాంటి జోక్యం చేసుకోం: భారత్
-
Oct 16, 2025 12:43 IST
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి దక్కని ఊరట
బీసీ రిజర్వేషన్లపై స్పెషల్ లీవ్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలన్న ధర్మాసనం
తదుపరి విచారణ హైకోర్టులో కొనసాగుతుందన్న సుప్రీంకోర్టు
-
Oct 16, 2025 12:34 IST
ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ వాదనలు
రిజర్వేషన్లు 50శాతం మించొద్దన్న తీర్పులు స్పష్టంగా ఉన్నాయి: గోపాల్
కృష్ణమూర్తి జడ్జిమెంట్ ఈ విషయాన్ని స్పష్టంగా ఉంది: గోపాల్
షెడ్యూల్డ్ ప్రాంతాలు కలిగిన రాష్ట్రాల్లోనే 50% రిజర్వేషన్ల పరిమితి దాటింది
బీసీల కోసం 50శాతం పరిమితి దాటొచ్చనే తీర్పు లేదు: గోపాల్
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో 50శాతం పరిమితి దాటకుండా..
ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం చెప్పింది: ప్రతివాదుల న్యాయవాది గోపాల్
-
Oct 16, 2025 12:27 IST
శివాజీ స్ఫూర్తి కేంద్రానికి ప్రధాని మోదీ
శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను తిలకించనున్న ప్రధాని
-
Oct 16, 2025 12:26 IST
ఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ
హైకోర్టు స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు
తక్షణమే జోక్యం చేసుకోవాలని కోర్టును కోరిన సింఘ్వీ
రిజర్వేషన్లు 50శాతం మించొద్దనే అభిప్రాయం సరికాదు: సింఘ్వీ
ఇందిరా సహానీ కేసులోనూ 50శాతం పరమితి దాటొచ్చని ఉంది
దేశంలో ఎక్కడా జరగని విధంగా తెలంగాణలో సర్వే జరిగింది
ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి లెక్క తేల్చింది: అభిషేక్ సింఘ్వీ
రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి
3 నెలలు దాటినా బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు: సింఘ్వీ
3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే బిల్లు ఆమోదం పొందినట్టేనని సుప్రీం చెప్పింది
సుప్రీం తీర్పు ప్రకారం బిల్లు చట్టంగా మారినట్టే: అభిషేక్ సింఘ్వీ
-
Oct 16, 2025 12:05 IST
ఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ
హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లిన తెలంగాణ సర్కార్
జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం ముందు విచారణ
తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు
-
Oct 16, 2025 12:04 IST
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేతల ఇళ్లపై పోలీసుల దాడి
కల్తీ మద్యంపై ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించిన వైసీపీ నేతలు
మంత్రి లోకేష్, మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌పై సోషల్ మీడియాలో..
ఫేక్ పోస్టులు పెట్టారంటూ విజయవాడ సీపీకి టీడీపీ నేతలు ఫిర్యాదు
వైసీపీ నేతల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
-
Oct 16, 2025 12:04 IST
హైదరాబాద్: దీపావళి సందర్భంగా స్వీట్ షాపులపై GHMC సిబ్బంది స్పెషల్ డ్రైవ్
నగరంలోని 43 స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
గడువు ముగిసిన పదార్థాలు స్వీట్ల తయారీలో వాడుతున్నట్లు గుర్తింపు
షాపుల్లో అమ్మే వస్తువులకు లేబుల్, ఎక్స్‌పైరీ డేట్ లేదన్న అధికారులు
స్వీట్లలో ప్రమాదకర సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు నిర్ధారణ
నిబంధనలు పాటించని షాపులకు నోటీసులు, భారీ పెనాల్టీలు విధింపు
-
Oct 16, 2025 12:04 IST
డెక్కన్ సిమెంట్ వివాదంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందన
వివాదంపై స్పందించడానికి నిరాకరించిన మంత్రి ఉత్తమ్
వివాదంతో తనకి సంబంధం లేదన్న మంత్రి ఉత్తమ్
నేను జోక్యం చేసుకోలేదని కొండా సురేఖ కుమార్తే చెప్పింది కదా: ఉత్తమ్
-
Oct 16, 2025 12:03 IST
రంగారెడ్డి: లింగంపల్లిలో ఓ ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ
ముందస్తు సమాచారంతో దాడి చేసి రేవ్‌పార్టీని భగ్నం చేసిన పోలీసులు
రేవ్ పార్టీలో 25 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నట్లు గుర్తింపు
2.40 లక్షల నగదు, 15 సెల్‌ఫోన్లు, 11 వాహనాలు స్వాధీనం
రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని మంచాల పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
-
Oct 16, 2025 12:03 IST
మంత్రి కొండా సురేఖకు ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్
మీడియా ముందు మాట్లాడవద్దని సురేఖకు మీనాక్షి హితవు
మధ్యాహ్నం మీనాక్షి నటరాజన్‌ను కలవనున్న మంత్రి కొండా సురేఖ
-
Oct 16, 2025 12:02 IST
మంత్రుల మధ్య వివాదం లేదు: ABNతో టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
ఓ కంపెనీకి సంబంధించిన అంశంలో కేసు ఫైల్ అయింది
ఆ కంపెనీపై సురేఖ ఫిర్యాదు చేసినట్టు సమాచారం ఉంది
కంపెనీపై సీఎం విచారణకు ఆదేశించినట్టు తెలిసింది: ABNతో మహేష్‌గౌడ్
మీనాక్షి, సీఎం రేవంత్‌తో చర్చించి సమస్యను పరిష్కరిస్తాం
కేబినెట్ నుంచి సురేఖను తీసే అంశం చర్చలో లేదు: మహేష్‌గౌడ్
-
Oct 16, 2025 11:08 IST
ఎక్స్‌లో విరాట్ కోహ్లీ ఆసక్తికర పోస్ట్
విఫలమయ్యేది.. వదులుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే
పోరాటం ఆపాలనుకుంటే.. ఓడిపోయినట్టే: విరాట్ కోహ్లీ
-
Oct 16, 2025 10:30 IST
పెట్టుబడులపై ఎక్స్‌లో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర పోస్ట్
ఆంధ్రా వంటకాలు స్పైసీగా ఉంటాయని అంటారు..
ఇప్పుడు ఏపీకి వచ్చే పెట్టుబడులూ స్పైసీగా ఉన్నాయి: లోకేష్
పొరుగువారికి అప్పుడే మంట మొదలైంది: ఎక్స్‌లో లోకేష్
-
Oct 16, 2025 10:12 IST
చిత్తూరు: ములకలచెరువు మద్యం కేసు 10నిందితుల కస్టడీకి అనుమతి
10 మంది నిందితులను కస్టడీకి అనుమతించిన తంబళ్లపల్లె కోర్టు
రేపటినుంచి 3 రోజుల కస్టడీ విచారణకు కోర్టు అనుమతి
3 రోజుల కస్టడీకి సురేందర్ నాయుడును అనుమతి ఇచ్చిన కోర్టు
మిగిలిన 9 మందికి 2 రోజుల విచారణకు అనుమతించిన కోర్టు
మదనపల్లి సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితులను రేపు కస్టడీకి తీసుకోనున్న పోలీసులు
ములకలచెరువు ఎక్సైజ్ స్టేషన్‌లో నిందితులను ప్రశ్నించనున్న ఎక్సైజ్ పోలీసులు
-
Oct 16, 2025 10:09 IST
ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్‌గాంధీ
ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారు: రాహుల్‌గాంధీ
భారత్ నిర్ణయాలను ట్రంప్ ప్రభావితం చేస్తున్నారు: రాహుల్
రష్యా చమురు కొనుగోళ్లు ఆపేస్తున్నట్టు మోదీ హామీ ఇచ్చారని ట్రంప్ వ్యాఖ్యలు
-
Oct 16, 2025 09:26 IST
ఓర్వకల్లులో రూ.2,786 కోట్లతో పారిశ్రామిక కేంద్రానికి శంకుస్థాపన
కడప జిల్లా కొప్పర్తిలో రూ.2,136 కోట్లతో పారిశ్రామిక కేంద్రం
రూ.493 కోట్లతో కొత్తవలస-విజయనగరం మధ్య నాలుగో రైల్వే లైన్
రూ.184 కోట్లతో పెందుర్తి-సింహాచలం నార్త్ స్టేషన్ల మధ్య రైల్వే బ్రిడ్జి
చిత్తూరు జిల్లాలో రూ.200 కోట్లతో ఇండేన్ గ్యాస్ ప్లాంట్
-
Oct 16, 2025 09:25 IST
హైదరాబాద్: గండిపేట్ లో దారుణం కన్న తల్లిదండ్రుల పై దాడి చేసిన సైకో.
అర్ధరాత్రి తల్లిదండ్రుల పై కత్తి తో విచక్షణా రహితంగా పొడిచిన కొడుకు..
తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. పరిస్థితి విషమం.
తల్లి భారతి, తండ్రి రవీందర్ రెడ్డి. గండి పేట్ EIPL Apela అపార్ట్మెంట్ లో ఉంటున్న కుటుంబం.
నిందితుడు రఘుపాల్ రెడ్డి. ఓ లా కళాశాల లో ఎల్ఎల్బీ చదువుతున్న రఘుపాల్.
గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న రఘు.
తన తల్లిదండ్రులు మానసికంగా వేదిస్తున్నారు,
నాకు మతి స్థిమితం సరిగ్గా లేదని, నాకు వైద్యం చేయించాలని చూస్తున్నారని దాడి చేసి నట్లు పోలీసులకు చెప్పిన సైకో.
నాకు ఏమి కాలేదు. నా తల్లిదండ్రులు కావాలనే నన్ను మానసికంగా వేదిస్తున్నారంటూ రెచ్చిపోయి తల్లిదండ్రుల కత్తి తో దాడి.
పోలీసుల అదుపులో నిందితుడు.
-
Oct 16, 2025 09:24 IST
నెల్లూరు: అల్లూరు రోడ్డు వద్ద ఆరెంజ్ ట్రావెల్ బస్సు కు తప్పిన పెను ప్రమాదం..
హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా ప్రమాదం..
ముందు వాహనాన్ని ఓవర్ టెక్ చేయబోయి డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం..
ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు..
ప్రయాణికులకు స్వల్ప గాయాలు ఘటనా స్థలానికి చేరుకున్న దగదర్తి పోలీసులు.
-
Oct 16, 2025 09:15 IST
నేడు మ.3గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ
బీసీ రిజర్వేషన్లు, రైతు భరోసా, మైనింగ్ కొత్త పాలసీ,..
మెట్రో ఫేజ్-2 టెండర్లపై నిర్ణయం తీసుకునే అవకాశం
కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ హాజరుపై ఉత్కంఠ
తన ఇంటికి పోలీసులు రావడంపై ఆగ్రహంగా ఉన్న సురేఖ
-
Oct 16, 2025 08:34 IST
కొండా సుస్మిత పటేల్ ఆరోపణలను ఖండించిన రోహిన్ రెడ్డి
ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం: రోహిన్‌రెడ్డి
కొండా సురేఖ మాజీ OSD అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చేవారు
నాకు డెక్కన్ సిమెంట్స్ అంశాన్ని సుమంత్ చెప్పారు: రోహిన్‌రెడ్డి
నేను జోక్యం చేసుకోనని చెప్పి సుమంత్‌ను పంపేశా: రోహిన్‌రెడ్డి
-
Oct 16, 2025 08:26 IST
తిరుపతి: మద్యం తాగి వాహనాలు నడిపిన 33 మందికి తిరుపతి కోర్టు జరిమానా
జరిమానా విధిస్తూ తిరుపతి 3వ అదనపు కోర్టు జడ్జి సంధ్యారాణి తీర్పు
నిందితులు ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున జరిమానా విధింపు
-
Oct 16, 2025 08:09 IST
హైదరాబాద్: జగన్ విదేశీ పర్యటనపై కోర్టును ఆశ్రయించిన సీబీఐ
విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంత నెంబర్‌కు బదులు..
మరో నెంబర్ ఇచ్చారని మెమో దాఖలు చేసిన సీబీఐ
బెయిల్ షరతులు ఉల్లంఘించినందుకు..
జగన్ పర్యటన అనుమతిని రద్దు చేయాలని కోర్టును కోరిన సీబీఐ
కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరఫు లాయర్‌కు సీబీఐ కోర్టు ఆదేశం
మెమోపై నేడు విచారణ చేపట్టనున్న సీబీఐ కోర్టు
-
Oct 16, 2025 07:47 IST
తిరుపతి: పాఠశాలకు మద్యం తాగి వచ్చిన 10th స్టూడెంట్
తొటి విద్యార్థులు ఉపాద్యాయులకు పిర్యాదు
తనిఖీలో స్కూల్ బ్యాగులో మద్యం బాటిళ్లు లభ్యం
విద్యార్థిని మందలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన హెడ్ మాస్టర్
తల్లిదండ్రులు వచ్చేలోపు పహారీ దూకి పారిపోయిన విద్యార్థి
విద్యార్థి కోసం వెతకగా రైలు పట్టాలపై మృతదేహం
చంద్రగిరి మండలం కొంగరవారిపల్లె దగ్గర ఘటన, చిత్తూరు రైల్వేపోలీసు దర్యాప్తు
-
Oct 16, 2025 07:46 IST
రష్యా చమురు కొనుగోలు అంశంలో భారత్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
రష్యా చమురు కొనుగోలును త్వరలో ఆపేస్తున్నట్లు మోదీ హామీ ఇచ్చారు: ట్రంప్
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఒంటరి చేయడంతో ఇదో కీలక అడుగు: ట్రంప్
అమెరికాకు భారత్ సన్నిహిత భాగస్వామి: ట్రంప్
ప్రధాని మోదీ నాకు స్నేహితుడు.. మా మధ్య గొప్ప అనుబంధం ఉంది: ట్రంప్
ట్రంప్ వ్యాఖ్యలపై ఇంకా స్పందించని భారత్
-
Oct 16, 2025 07:46 IST
భారత్, రష్యా చమురు కొనుగోలుపై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్
రష్యా చమురు కొనుగోలు త్వరలో ఆసేస్తున్నట్లు మోదీ హామీ ఇచ్చారు: ట్రంప్
-
Oct 16, 2025 07:45 IST
న్యూయార్క్: బ్రిక్స్ కూటమిపై మరోసారి ట్రంప్ అక్కసు
బ్రిక్స్ కూటమి అంటే అమెరికన్ డాలర్‌పై 'దాడి' అని అభివర్ణ
సుంకాల భయంతో చాలా దేశాలు వెనక్కి తగ్గాయి: ట్రంప్
-
Oct 16, 2025 07:00 IST
పాకిస్థాన్- అఫ్గాన్ సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు
40 మందికిపైగా తాలిబన్ల హతం
48 గంటల కాల్పుల విరమణ ప్రకటించిన ఇరు దేశాలు
-
Oct 16, 2025 07:00 IST
విజయవాడ: మిథున్‌రెడ్డి పిటిషన్‌పై నేడు విచారణ
అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరిన మిథున్‌రెడ్డి
మిథున్‌రెడ్డి పిటిషన్‌పై నేడు ACB కోర్టులో విచారణ
చెవిరెడ్డి పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ
ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు అనుమతి కోరుతూ పిటిషన్
-
Oct 16, 2025 06:59 IST
ఏపీ నకిలీ మద్యం కేసు నిందితుల కస్టడీపై నేడు విచారణ
జనార్దన్, జగన్‌మోహన్‌ను 10 రోజులు కస్టడీ కోరుతూ..
కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎక్సైజ్ అధికారులు
ఎక్సైజ్ అధికారుల పిటిషన్‌పై విచారించనున్న కోర్టు
-
Oct 16, 2025 06:59 IST
ముంబై: మాకు మరిన్ని ద్వైపాక్షిక విమాన హక్కులు ఇవ్వాలి: ఎతిహాద్ ఎయిర్‌వేస్
భారత్ అదనపు సర్వీసులు ఇవ్వకపోతే..
మా విమానాలను ఇతర గమ్యస్థానాలకు మళ్లిస్తాం: ఎతిహాద్ ఎయిర్‌వేస్
-
Oct 16, 2025 06:57 IST
ఢిల్లీ: భారత్‌పై చైనా ఫిర్యాదు
ఈవీ, బ్యాటరీలకు రాయితీ ఇస్తోందని చైనా ఫిర్యాదు
-
Oct 16, 2025 06:57 IST
ముంబై: వడ్డీ రేట్ల కోతలకు అవకాశం ఉంది: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్
-
Oct 16, 2025 06:57 IST
మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హైడ్రామా
ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం నివాసానికి వెళ్లిన పోలీసులు
పోలీసులతో కొండా సురేఖ కూతురు వాగ్వాదం
తమ కుటుంబంపై సీఎం రేవంత్, పొంగులేటి, వే నరేందర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు
రెడ్లు అంతా కలిసి బీసీ మంత్రి అయిన తన తల్లిని..
అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని సుష్మిత ఫైర్
డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను సుమంత్ రివాల్వర్‌తో బెదిరించారంటూ కేసు?
ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసుల చర్యలు
-
Oct 16, 2025 06:55 IST
వెంకటేష్, శ్రీనివాస్ వ్యవహారంలో టీ.బీజేపీ సీరియస్
మాజీ ఎంపీ వెంకటేష్ నేత, గోమాస శ్రీనివాస్‌కు..
షోకాజ్ నోటీసులు జారీ చేసిన బీజేపీ క్రమశిక్షణ కమిటీ
రాంచందర్‌రావు మంచిర్యాల జిల్లా పర్యటనలో..
ఘర్షణ పడ్డ వెంకటేష్ నేత, గోమాస శ్రీనివాస్
మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని బీజేపీ ఆదేశం
-
Oct 16, 2025 06:55 IST
ఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లిన తెలంగాణ సర్కార్
జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం ముందు విచారణ
-
Oct 16, 2025 06:08 IST
శ్రీశైలంలో ఆంక్షలు.. రాకపోకలు నిలుపుదల
ప్రధాని నరేంద్ర మోదీ రాక సందర్భంగా శ్రీశైలం మహా క్షేత్రంలో భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు
శ్రీశైలంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు
1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు
ప్రధాని పర్యటనతో శ్రీశైలంలో ఆంక్షలు.
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు శ్రీశైలానికి రాకపోకలు నిలుపుదల.
-
Oct 16, 2025 06:03 IST
నేడు ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ రాక
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేడు ప్రధాని మోదీ పర్యటన
ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు రానున్న ప్రధాని
అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సుండిపెంట వెళ్లనున్న మోదీ
రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు
ఉదయం 11.15కు శ్రీశైలం ఆలయంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోనున్న ప్రధాని
మధ్యాహ్నం 12.10 శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం సందర్శన
అనంతరం సుండిపెంటకు చేరుకొని అక్కడ నుంచి.. హెలికాప్టర్‌లో నేరుగా నన్నూరు రాగ మయూరి గ్రీన్ హిల్స్ ఎలిప్యాడ్స్ వస్తారు
2.30లకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని
మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధాని బహిరంగ సభ
సాయంత్రం 4.5కు కార్యక్రమం ముగించుకుని కర్నూలు ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్న ప్రధాని నరేంద్ర మోదీ.