-
-
Home » Mukhyaamshalu » telugu Viral trending Telangana Andhra Pradesh national and international Breaking news 12th nov 2025 kjr
-
BREAKING: ఢిల్లీ పేలుళ్లు.. ఆ కారు దొరికేసింది..
ABN , First Publish Date - Nov 12 , 2025 | 06:09 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 12, 2025 18:29 IST
ఢిల్లీ పేలుడు ఘటనలో అనుమానిత కారు స్వాధీనం
కారు స్వాధీనం చేసుకున్న ఫరీదాబాద్ పోలీసులు.
ఖండవాలి గ్రామం దగ్గర పార్క్ చేసి ఉన్న కారు.
అనుమానిత కారు నెంబర్ DL 10 CK 0458.
డాక్టర్ ఉమర్ పేరుపై రిజిస్టర్ అయిన ఎకో స్పోర్ట్స్ కారు.
-
Nov 12, 2025 18:06 IST
డిసెంబర్ 5న భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్
రష్యా-భారత్ ఫోరమ్‌లో పాల్గొననున్న పుతిన్
ఢిల్లీలో డిసెంబల్ 4, 5న రష్యా-భారత్ ఫోరమ్
-
Nov 12, 2025 17:54 IST
కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ జనవరి రెండో వారానికి వాయిదా
తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలుకు 4 వారాల గడువు ఇచ్చిన హైకోర్టు
కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దంటూ..
గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన తెలంగాణ హైకోర్టు
-
Nov 12, 2025 16:57 IST
ముగిసిన ప్రకాష్ రాజ్ సిఐడి విచారణ..
బెట్టింగ్ యాప్ కేసులో ముగిసిన ప్రకాష్ రాజ్ CID సిట్ విచారణ.
జంగిల్ రమ్మీ యాప్‌తో ఒప్పందాలు చేసుకున్న విషయాలు విచారణలో తెలిపిన ప్రకాష్ రాజ్.
2016లో గేమింగ్ యాక్ట్ అనేది లేదు. ఆ సమయంలో నేను జంగిల్ రమ్మీ యాప్‌ను ప్రమోట్ చేశానని చెప్పిన ప్రకాష్ రాజ్.
జంగిల్ రమ్మీ యాప్ ద్వారా తనకు ఒక్క పైసా నగదు కూడా రాలేదని వాంగ్మూలం ఇచ్చిన ప్రకాష్ రాజ్.
జంగిల్ రమ్మీ యాప్ యాజమాన్యంతో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని స్టేట్మెంట్.
-
Nov 12, 2025 16:50 IST
ఢిల్లీ: ఎర్రకోట దగ్గర పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం
వెలుగులోకి మరో అనుమానిత కారు, పోలీసుల గాలింపు
డాక్టర్ ఉమర్ పేరుపై రిజిస్టర్ అయిన ఫోర్డ్ కారు నెంబర్ DL 10CK 0458
అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసిన నిఘా సంస్థలు
జమ్మూకశ్మీర్, హర్యానా, యూపీ, ఢిల్లీ పోలీసుల గాలింపు
-
Nov 12, 2025 13:55 IST
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
రాత్రి 7 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి..
రేపు ఇండో యూఎస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం..
తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై చర్చ..
డిసెంబర్ 8, 9 న హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్న సీఎం.
-
Nov 12, 2025 13:39 IST
రూ.60 లక్షల బంగారు చోరీ
కాకినాడ: సెప్టెంబర్ 10న తాళ్లూరు దాబా దగ్గర ఆగి ఉన్న బస్సులో బంగారం చోరీ
60 లక్షలు విలువ గల 624 గ్రాములు బంగారం దొంగలించిన దొంగలు..
విజయనగరానికి చెందిన తేజ, మహేందర్‌ను అదుపులోకి తీసుకుని, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన పోలీసులు.
-
Nov 12, 2025 12:29 IST
కల్తీ నెయ్యి వ్యవహారంలో కొనసాగుతున్న విచారణ..
తిరుపతి: టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో రెండో రోజు కొనసాగుతున్న సీబీఐ సిట్ విచారణ..
తిరుపతి అలిపిరి కేంద్రంలో సిట్ కార్యాలయానికి విచారణకు వేర్వేరుగా హాజరైన టీటీడీ మాజీ అదనపు ఈవో..
ఏవీ ధర్మారెడ్డి, బోలెబాబా డైరెక్టర్ విపిన్ జైన్, పామిల్ జైన్..
రెండో రోజు కూడా కొనసాగుతున్న విచారణ.
-
Nov 12, 2025 12:23 IST
పిచ్చికుక్క స్వైర విహారం..
అనకాపల్లి జిల్లా వడ్డాది గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం..
సుమారు 20 మందిని గాయపరిచిన పిచ్చికుక్క..
గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం చోడవరం CHCకి తరలింపు.
-
Nov 12, 2025 11:25 IST
నేడు భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం
ఢిల్లీ: సాయంత్రం 5.30కి కేంద్ర కేబినెట్ భేటీ
భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం
ఎర్రకోట కారు బాంబు పేలుడు ఘటనపై చర్చించనున్న సీసీఎస్
-
Nov 12, 2025 10:23 IST
పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు
మధురానగర్ పీఎస్‌లో పాడి కౌశిక్ రెడ్డిపై కేస్ నమోదు చేసిన పోలీసులు
నిన్న ఎన్నికల సందర్భంగా యూసఫ్ గూడ వద్ద కౌశిక్ రెడ్డి హల్చల్
అనుచరులతో కలిసి మహమ్మద్ ఫంక్షన్ హాల్లోకి చొచ్చుకెళ్లిన కౌశిక్ రెడ్డి
పోలీసులు వద్దని చెప్పినా వినకుండా లోపలకి నెట్టుకెళ్లిన కౌశిక్ రెడ్డి
ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ కౌశిక్ పై కేస్ నమోదు
ట్రేస్ పాస్‌తో పాటు న్యూసెన్స్ కేస్ నమోదు చేసిన మధురానగర్ పోలీసులు
-
Nov 12, 2025 10:22 IST
డిజిటల్ అరెస్ట్ పేరుతో దోపిడీ
పుణేలో డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్ల దోపిడీ
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ సంతకం ఫోర్జరీ చేసి.. ఓ మహిళ నుంచి రూ.99లక్షలు వసూలు.
-
Nov 12, 2025 09:37 IST
వ్యక్తి దారుణ హత్య
నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం ఆర్‌ఎస్ రంగాపురంలో వ్యక్తి హత్య..
మహబూబ్ బాషా (30) అనే వ్యక్తిని నరికి చంపిన దుండగులు..
మహబూబ్ బాషా హత్యకు కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు.
-
Nov 12, 2025 09:36 IST
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం..
రూ.3 కోట్లు విలువ చేసే ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం..
డ్రోన్‌లు, ఎలక్ట్రానిక్ వాచ్‌లు, ఐఫోన్‌లు స్వాధీనం..
ఇద్దరు ప్యాసింజర్లు అరెస్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ ఆధికారుల తనిఖీలు..
అబుదబీ నుండి వచ్చిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న సీఐఎస్ఎఫ్..
పట్టుబడ్డ వ్యక్తులు సూర్యప్రకాష్, మహమ్మద్ జాంగిర్‌గా గుర్తింపు..
వారి లగేజీ బ్యాగేజ్‌లో డ్రోన్ కెమెరాలు, ఐ ఫోన్‌లు, ల్యాప్ టాప్‌లు గుర్తింపు.
-
Nov 12, 2025 09:33 IST
నేడు ఢిల్లీకి మంత్రి నారాయణ
మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్న మంత్రి..
మున్సిపల్ శాఖకు సంబంధించి కేంద్ర పథకాల ద్వారా రావాల్సిన నిధులు కేటాయింపు, విడుదలపై చర్చించనున్న మంత్రి..
మంత్రి నారాయణతో పాటు ఢిల్లీ వెళ్తున్న మునిసిపల్ శాఖ ఉన్నతాధికారులు.
-
Nov 12, 2025 09:16 IST
ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో వాయు కాలుష్యం
727 పాయింట్లకు చేరిన కాలుష్య స్థాయి..
హైబ్రిడ్ మోడ్‌లో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు..
గ్రాఫ్ 3 విధానాలను అమలుపరుస్తున్న ఢిల్లీ ప్రభుత్వం..
ప్రైవేటు సంస్థలు సైతం వర్క్ ఫ్రం హోం లేదా హైబ్రిడ్ మోడ్ లో పని చేయాలని ప్రభుత్వం ఆదేశం..
అన్ని రకాల నిర్మాణ పనులు నిలిపివేత, బీఎస్ 3 పెట్రోల్ వాహనాలు, బీఎస్ 4 డీజిల్ వాహనాలు ఢిల్లీ లోపలికి నిషేధం ..
అంతరాష్ట్ర బస్సు సర్వీస్‌లకూ నో ఎంట్రీ.
-
Nov 12, 2025 09:02 IST
బాలీవుడు నటుడు గోవిందాకు అస్వస్థత
ముంబై: బాలీవుడు నటుడు గోవిందాకు అస్వస్థత
నివాసంలో ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయిన గోవిందా
ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స
-
Nov 12, 2025 08:59 IST
నేడు డాక్ యార్డ్ వంతెన ప్రారంభం
విశాఖ: నేడు డాక్ యార్డ్ వంతెన ప్రారంభం
భారీ వాహనాలకు మినహా మిగిలిన అన్ని రకాల వాహనాలకు అనుమతులు..
రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పోర్ట్ అధికారులు..
తీరనున్న పారిశ్రామిక ప్రాంతవాసుల ప్రయాణ కష్టాలు.
-
Nov 12, 2025 07:56 IST
ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను: కొండా సురేఖ
అర్థరాత్రి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కొండా సురేఖ..
నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలను నేను ఉపసంహరించుకుంటున్నాను..
ఆయన మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం నాకు లేదు..
ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలని, అపకీర్తి కలిగించాలనే ఉద్దేశ్యం నాకు ఎప్పటికీ లేదు..
నా వ్యాఖ్యల వల్ల ఏవైనా అనుకోని అపోహలు కలిగినట్లయితే, దానికి నేను చింతిస్తున్నాను..
రేపు నాంపల్లి స్పెషల్ కోర్టులో నాగార్జున పరువు నష్టం పిటిషన్‌పై విచారణ..
విచారణకు ఒక రోజు ముందు నాగార్జునను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టిన కొండా సురేఖ.
-
Nov 12, 2025 06:48 IST
నేడు రాయచోటిలో సీఎం పర్యటన
అన్నమయ్య జిల్లా : నేడు రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండల పరిధిలో సీఎం చంద్రబాబు పర్యటన
పేదల పక్కా గృహాల గృహ ప్రవేశం, ప్రజావేదిక సమావేశం , జిల్లా టీడీపీ నేతలతో సమావేశంలలో పాల్గొననున్న సీఎం.
-
Nov 12, 2025 06:46 IST
నేడు దర్శనాల నిలిపివేత
నేడు వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాల నిలిపివేత
అభివృద్ధి పనుల కోసం దర్శనాలు నిలిపివేసిన అధికారులు
భీమన్న ఆలయంలో దర్శనాల కోసం ఏర్పాట్లు
సమాచారం లేకుండా దర్శనం నిలిపివేయడంపై భక్తుల ఆగ్రహం
-
Nov 12, 2025 06:18 IST
నేడు విచారణకు.. నటుడు ప్రకాష్‌రాజ్
హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ విచారణ
నేడు విచారణకు హాజరుకానున్న నటుడు ప్రకాష్‌రాజ్
నిన్న విజయ్ దేవరకొండను విచారించిన సీఐడీ
-
Nov 12, 2025 06:14 IST
ఏపీలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు
17 నెలల్లో ఇళ్లు పూర్తి చేసిన లబ్ధిదారులకు పంపిణీ..
అన్నమయ్య జిల్లా నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
-
Nov 12, 2025 06:13 IST
నేడు విశాఖకు సీఎం చంద్రబాబు
CII ఇన్వెస్టర్ల సమ్మిట్‌పై సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక భేటీలు
-
Nov 12, 2025 06:12 IST
నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్
విశాఖలో జరగనున్న సీఐఐ సమ్మిట్..
కేంద్రమంత్రులను ఆహ్వానించనున్న మంత్రి నారా లోకేష్.