-
-
Home » Mukhyaamshalu » INSTANT Cinema and Politics National and International BREAKING NEWS FROM ABN across world on 21th august kjr
-
BREAKING: సీసీఎల్ఏ లో 217 పోస్టులను మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం..
ABN , First Publish Date - Aug 21 , 2025 | 06:21 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 21, 2025 19:09 IST
సీసీఎల్ఏ లో 217 పోస్టులను మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం..
కొత్త 15 రెవెన్యూ మండలల్లో 189 పోస్టులను భర్తీ చేయనున్న సర్కార్.
కొత్తగా ఏర్పడిన 2 రెవెన్యూ డివిజన్‌ల కోసం 28 పోస్టులు మంజూరు.
ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్.
ఈ పోస్టులను ఆదిలాబాద్ జిల్లా, మహబూబ్‌నగర్, వనపర్తి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో.. భర్తీ చేసేందుకు ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది.
-
Aug 21, 2025 17:55 IST
అల్లూరి: విలీన మండలాలకు వరద ముప్పు.
ఉదృతంగా ప్రవహిస్తున్న శబరి, గోదావరి నదులు.
కూనవరం దగ్గర రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరిన గోదావరి.
పోలిపాక వద్ద రహదారిపై చేరిన వరద నీరు.
కూనవరం- భద్రాచలం మధ్య నిలిచిపోయిన రాకపోకలు.
ఎటపాక మండలం నందిగామ ఇళ్ల సమీపంలోకి చేరిన వరద నీరు
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్తార్.
అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వాగుల వద్ద పోలీసుల పహార.
వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్న చింతూరు ఐడిఏ పిఓ అపూర్వ భరత్.
డివిజన్లోని లోతట్టు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు.
-
Aug 21, 2025 16:47 IST
ఏడుగురు ఎమ్మెల్యేల పనితీరుపై మంత్రి లోకేశ్ ఆగ్రహం
శ్రీశైలం, అనంతపురం, ఆముధాలవలస, గుంటూరు ఈస్ట్, తిరువూరు ఎమ్మెల్యేల పని తీరుపై లోకేష్ అసహనం.
ఇంచార్జి మంత్రులే మీ పరిధిలోని ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలి: లోకేశ్
ఎన్డీయే ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దు: మంత్రి లోకేశ్
-
Aug 21, 2025 15:50 IST
ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..
MLAలపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన సీఎం చంద్రబాబు.
అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన సీఎం చంద్రబాబు.
మంత్రులే మీ MLAలను పిలిచి హెచ్చరించాలని చంద్రబాబు ఆదేశం.
మనం మంచి పనులు చేస్తున్నాము.. కొంతమంది చేస్తున్న పనుల వల్లే మనకు చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది.
ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రులు జాగ్రత్తగా ఉండాలి: సీఎం చంద్రబాబు
-
Aug 21, 2025 13:34 IST
మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం
ఏ-1గా ఉన్న రాజ్ కెసిరెడ్డి ఆస్తుల జప్తుకు ఆదేశాలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
రాజ్ కెసిరెడ్డి ఆస్తులను అటాచ్ చేయడానికి ఏఎస్పీ, సీఐడీ- ఐవోకు అనుమతి
ఎస్పీఈ, ఏసీబీ కేసులు ట్రైల్స్ నిర్వహించే మూడవ అదనపు జిల్లా సెషన్ జడ్జి ముందు.. అటాచ్ కోసం పిటిషన్ వేయాలని ఉత్తర్వుల్లో వెల్లడి
-
Aug 21, 2025 12:25 IST
మరో ఇద్దరు మావోయిస్ట్‌ల లొంగుబాటు..
తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్ట్‌ల లొంగుబాటు..
రాష్ట్ర కమిటీ మెంబర్ కాకరాల సునీత అలియాస్ బద్రి , చెన్నూరు హరీష్ అలియాస్ శ్రీను లొంగుబాటు
రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎదుట మావోయిస్టులు లొంగుబాటు
కాకరాల సునీత అలియాస్ బద్రిపై కోటి రూపాయల రివార్డ్
-
Aug 21, 2025 11:38 IST
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి
నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శరత్ పవర్, ప్రియాంక గాంధీ, ఎస్పీ పార్టీ రామ్ గోపాల్ యాదవ్, డీఎంకే నుంచి తిరుచి శివ
రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీకి నామినేషన్ పత్రాలు అందజేసిన సుదర్శన్ రెడ్డి
-
Aug 21, 2025 09:37 IST
గోదావరి జిల్లాలకు అలెర్ట్
పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి
భద్రాచలం వద్ద ప్రస్తుతం 50.8 అడుగుల నీటిమట్టం
ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 10.03 లక్షల క్యూసెక్కులు
మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ప్రభావితం చూపే అల్లూరి, తూగో, కోనసీమ, కాకినాడ, ఏలూరు, పగో జిల్లాలకు అలెర్ట్
గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
-
Aug 21, 2025 09:19 IST
మియాపూర్‌లో దారుణం..
మక్త మహబూబ్ పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి....
పసికందును చంపేసి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం
కుటుంబం మొత్తం విషం తాగి ఆత్మహత్య
మృతుల్లో లక్ష్మయ్య (60), వెంకటమ్మ (55), అల్లుడు అనిల్ (40), కవిత (38), అనిల్ కవిత దంపతుల కుమార్తె అప్పు (2) ఉన్నారు.
సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్న పోలీసులు.
-
Aug 21, 2025 08:45 IST
చందానగర్ నాలాలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం
పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
మహిళ మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు
మహిళ చేతికి నర్సమ్మ అనే పచ్చబొట్టు
పర్స్‌లో కమ్మలు, బ్రాస్లెట్ ఉన్నట్టు గుర్తింపు
పోస్ట్‌మార్టం నిమిత్తం మహిళా మృతదేహాన్ని గాంధీకి తరలింపు
-
Aug 21, 2025 08:32 IST
నేడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
నేడు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియాగాంధీ, ఇండియా కూటమి ఎంపీలు.
-
Aug 21, 2025 08:28 IST
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఉచిత దర్శనం కోసం 25 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.
సర్వదర్శనం భక్తులకు 15 గంటల సమయం పడుతోంది.
300 రూ శీఘ్రదర్శనానికి 3-4 గంటల సమయం పడుతోంది.
సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతోంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 75,688
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,099
స్వామి వారి నిన్న హుండీ ఆదాయం: ₹4.45 కోట్లు
-
Aug 21, 2025 07:09 IST
గోదావరికి పెరిగిన వరద ఉధృతి
కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాటు వద్ద 16.45 మీటర్ల మేర ప్రవాహం
భద్రాచలం నుండి చర్ల వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో తూర్పాక గ్రామం వద్ద కల్వర్టు నిర్మాణానికి వేసిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం
చర్ల, వెంకటాపురం ప్రధాన రహదారిపై ఆలుబాక గ్రామం వద్ద నిలిచిన రాకపోకలు
భద్రాచలం నుండి ఆంధ్ర ఒడిశా ఛత్తీస్‌గడ్ వెళ్ళే జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు
-
Aug 21, 2025 06:21 IST
కృష్ణ నదీ పరివాహక ప్రాంతాల్లో హై అలెర్ట్
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
కృష్ణ నదీ పరివాహక ప్రాంత గ్రామాల్లో హై అలెర్ట్, బందోబస్తు
ప్రకాశం బ్యారేజ్ నుంచి 4 లక్షల 64 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల
భవానీ దీపానికి రాకపోకలు పూర్తిగా నిలిపివేసిన వేసిన అధికారులు