-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latest viral trending and Breaking news across globe 11Th oct 2025 kjr
-
BREAKING: టాస్క్‌ఫోర్స్ పోలీసులపై తండావాసుల దాడి
ABN , First Publish Date - Oct 11 , 2025 | 08:05 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 11, 2025 18:06 IST
ఢిల్లీ టెస్ట్: ముగిసిన రెండోరోజు ఆట
ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 140/4
378 పరుగుల తొలి ఇన్నింగ్స్ వెనుకంజలో వెస్టిండీస్
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 518/5 డిక్లేర్డ్
-
Oct 11, 2025 18:04 IST
సంగారెడ్డి: నారాయణఖేడ్ మం. చల్లగిద్దా తండాలో పోలీసులపై దాడి
చల్లగిద్దా తండాలో టాస్క్‌ఫోర్స్ పోలీసులపై తండావాసుల దాడి
పత్తినేనులో గంజాయి సాగుచేస్తున్నారన్న సమాచారంతో సోదాలు
60 గంజాయి మొక్కలను ధ్వంసం చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
పోలీసులపై తిరగబడిన తండావాసులు, వాగ్వాదం
టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఫోన్లు లాక్కున్న చల్లగిద్ద తండావాసులు
-
Oct 11, 2025 15:28 IST
ఐసీసీసీలో ఏఐ హబ్, టీ స్క్వేర్‌పై సీఎం రేవంత్ సమీక్ష
హాజరైన శ్రీధర్ బాబు, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, అధికారులు
వీహబ్ ఐకానిక్ బిల్డింగ్‌గా ఉండాలి: సీఎం రేవంత్
వి హబ్ నిర్మాణం కోసం జైకా ఫండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి
పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి: రేవంత్‌రెడ్డి
ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం..
ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్‌లో భవనాలను పరిశీలించాలి: రేవంత్‌రెడ్డి
ఏఐ సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్
-
Oct 11, 2025 15:28 IST
విజయవాడ: తొలిరోజే ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం
పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత..
మీడియా సమావేశం నిర్వహించిన నూతన చైర్మన్ రాధాకృష్ణ
చైర్మన్‌తో సహా కొందరి సభ్యుల మీడియా సమావేశం
ప్రెస్‌మీట్ ఉందని.. నాకు ఎందుకు చెప్పలేదని సిబ్బందిపై ఈఓ శినా నాయక్ ఆగ్రహం
చైర్మన్ కబురు పెట్టడంతో ఆలస్యంగా ప్రెస్‌మీట్‌కు ఈఓ శినా నాయక్
-
Oct 11, 2025 14:32 IST
కల్వర్టును ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి..
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు ఎస్టీ కాలనీ సమీపంలో నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.
కల్వర్టుని ఢీకొన్న కారు.. కారులో ప్రయాణిస్తున్న భర్త మృతి.
తల్లీ, ఇద్దరు చిన్నారులకి తీవ్రగాయాలు.
క్షతగాత్రులని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకి తరలింపు.
నెల్లూరు నుంచి బద్వేల్‌కి వెళ్తుండగా ఘటన.
-
Oct 11, 2025 14:18 IST
మెదక్ జిల్లాలో దారుణం
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులో దారుణం ...
ఓ మహిళపై అత్యాచారం.. వివస్త్రను చేసిచెట్టుకు కట్టివేసిన దుండగులు
బాధితురాలు మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలింపు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Oct 11, 2025 13:12 IST
సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు ప్రభుత్వం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కీలక చర్చలు
జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న.. మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్
సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింగ్వితో వీడియో కాన్ఫరెన్స్
హైకోర్టు స్టే నేపథ్యంలో తదుపరి చట్టపరమైన చర్యలపై చర్చ
జీవో 9 అమలుకై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు పై ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎం
-
Oct 11, 2025 12:31 IST
ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఫిక్స్..
ఈ నెల 16న కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధాని మోదీ
ఉదయం 7.50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న ప్రధాని
ఉదయం 10.20 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న మోదీ
హెలికాఫ్టర్‌లో సున్నిపెంటకు పయనం. అక్కడ నుంచి ఉదయం 11.10 గంటలకు రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు.
ఉదయం 11.45 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం
మధ్యాహ్నం 1.40 గంటలకు సుండిపెంటలో హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు బయులుదేరనున్న ప్రధాని మోదీ
మధ్యాహ్నం 2.30 గంటలకు రాగ మయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌కు చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు
మధ్యాహ్నం రాగమయూరి గ్రీన్ హిల్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొంటారు.
సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
అనంతరం కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనం.
-
Oct 11, 2025 11:11 IST
తిరుపతిలో చిరుత కలకలం..
తిరుపతి ఎస్వీ యూనివర్శిటిలో మరోసారి చిరుతల కలకలం.
గత రాత్రి ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలోకి వచ్చిన చిరుత.
సీసీ కెమెరాలో రికార్డైన చిరుత సంచరిస్తున్న దృశ్యాలు
వెటర్నరీ, వేదిక్, ఎస్వీ యునివర్సిటీలో చిరుతలను పట్టేందుంకు ఇప్పటికే ఐదు బోన్లు ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు
రాత్రిపూట విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచన
విద్యార్థులు రాత్రిపూట బయటకు రావద్దని అధికారుల హెచ్చరిక.
-
Oct 11, 2025 10:39 IST
మంత్రుల మధ్య.. టెండర్ల వార్..
మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్‌కు కొండా సురేఖ ఫిర్యాదు
మేడారం టెండర్లలో ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి జోక్యం
దేవాదాయశాఖకు చెందిన రూ.71కోట్ల టెండర్‌ను..
తన మనిషికి ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నాలు
పొంగులేటి తీరుపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి
తన శాఖలో మంత్రి పొంగులేటి జోక్యంపై ఆగ్రహం
పొంగులేటిపై సీఎం, అధిష్టానానికి ఫిర్యాదు చేసిన కొండా సురేఖ
-
Oct 11, 2025 09:47 IST
నేడు తెలంగాణకు ఏఐసీసీ పరిశీలకులు
DCC అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు పరిశీలకులుగా 22 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు
వారం రోజుల పాటు జిల్లాల్లో ఏఐసీసీ పరిశీలకుల పర్యటన
హైకమాండ్‌కు నివేదిక ఇవ్వనున్న ఏఐసీసీ పరిశీలకులు
-
Oct 11, 2025 09:34 IST
రేపు విశాఖకు రానున్న మంత్రి నారా లోకేష్..
కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి ప్రారంభించనున్న లోకేష్
సిఫీ టెక్నాలజీస్‌కు ఓజోన్ వ్యాలీలో కేటాయించిన స్థలంలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి
పీఎం పాలెంలో క్రికెట్ మ్యాచ్ వీక్షించనున్న మంత్రి లోకేష్
-
Oct 11, 2025 08:23 IST
నేడు దేవలంపేటకు హోం మంత్రి అనిత..
అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనను పరిశీలించనున్న అనిత.
11 గంటలకు దేవలంపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకోనున్న అనిత.
అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్న హోం మంత్రి.
-
Oct 11, 2025 08:11 IST
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. నలుగురికి గాయాలు..
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కుదావంద్ పూర్ గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం
పరిగి - షాద్‌నగర్ ప్రధాన రహదారిపై బొలేరో వాహనం జాయింట్ రాడ్ విరగడంతో అదుపు తప్పి బోల్తా...
వాహనంలో ఉన్న కుమ్మరి రాజు (38) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి...
మరో ముగ్గురికి గాయాలు... పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
చిట్యాల నుండి రావులపల్లికి బొలేరో వాహనంలో ఫర్నీచర్ వస్తువులు తరలిస్తుండగా ఘటన.