-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latest Breaking Cinema Business National and International news across the globe 16th sept 2025 kjr
-
BREAKING: హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్..
ABN , First Publish Date - Sep 16 , 2025 | 06:00 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 16, 2025 20:09 IST
తెలంగాణలో నలుగురు IASల బదిలీ, కొత్తగా అదనపు బాధ్యతలు.
ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ రామకృష్ణా రావు
సర్ఫరాజ్ అహ్మద్ - మెట్రో ఎండిగా పూర్తి అదనపు బాధ్యతలు.
శృతి ఓజ - ఎస్సీ, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్.
కృష్ణ ఆదిత్య - TGSWRIES సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు.
కోట శ్రీవత్స - హెచ్ఎండిఏ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు.
-
Sep 16, 2025 19:55 IST
మెట్రో రైల్ ఎండీ NVS రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియామకం
ఆయన స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్ కి మెట్రో రైల్ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
-
Sep 16, 2025 17:53 IST
ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన రాజ్ కేసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..
విజయవాడ: ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రాజ్ కేసిరెడ్డి.
అనారోగ్యంతో బాధపడుతున్నట్లు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఏసీబీ కోర్టులో పిటిషన్.
ఇదే కేసులో ఏసీబీ కోర్టులో స్టేట్యుటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
లిక్కర్ కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి.
రెండు పిటిషన్లు ఈనెల 18 వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు.
-
Sep 16, 2025 17:31 IST
కాంగ్రెస్ నాయకుడు మధు యాష్కీ గౌడ్‌కు అస్వస్థత.
సెక్రటేరియట్‌లోని శ్రీధర్ బాబు ఛాంబర్‌లో కళ్ళు తిరిగి పడిపోయిన మాజీ ఎంపీ మధుయాష్కి.
మంత్రి శ్రీధర్ బాబు ముందే అస్వస్థతకు గురికావడంతో వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసిన మంత్రి.
మధు యాష్కీ ని హాస్పిటల్‌కు పంపిన మంత్రి శ్రీధర్ బాబు.
-
Sep 16, 2025 15:58 IST
టీమ్ ఇండియాకు కొత్త స్పాన్సర్
కొత్త స్పాన్సర్‌గా అపోలో టైర్స్
-
Sep 16, 2025 14:16 IST
రాజేంద్రనగర్ కిస్మత్‌పూర్‌లో మహిళ డెడ్ బాడీ కలకలం
గుర్తు తెలియని మహిళలను హత్య చేసిన దుండగులు.
ఆత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానం.
మృతదేహంపై బట్టలు లేకపోవడం తో రేపే అండ్ మర్డర్ గా అనుమానం.
ఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు.
రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ బృందాలు. పలు ఆధారాలు స్వేకరించిన కాప్స్.
కిస్మత్ పూర్ బ్రిడ్జి కిందకి మహిళలను తీసుకొని వెళ్ళి అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు.
స్థానిక పరిసరాల్లో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు.
-
Sep 16, 2025 13:54 IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
బీసీ నినాదంతో ఎన్నికల్లో పోటీ చేయనున్న తీన్మార్ మల్లన్న
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడే కొద్ది రాజకీయంగా రోజుకో కొత్త ట్విస్ట్
మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న కవిత
-
Sep 16, 2025 13:03 IST
హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఉద్రిక్తత
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలంటూ ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన.
రూ.8500 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్.
బారికేడ్లు నెట్టుకుంటూ కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థులు.
ABVP నేతలను పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం.
ఏబీవీపీ విద్యార్థుల అరెస్ట్.. సైదాబాద్ పీఎస్‌కు తరలింపు.
-
Sep 16, 2025 12:42 IST
MLC జయంగళం రాజీనామా ఆమోదించాలంటూ హైకోర్టులో పిటిషన్
రాజీనామా ఆమోదించే మండలి చైర్మన్‌ను ఆదేశించాలని పిటిషన్
మండలి చైర్మన్ తరపు కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని అభ్యర్థన
అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు న్యాయమూర్తి రామకృష్ణ ప్రసాద్
ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామన్న జస్టిస్ రామకృష్ణ ప్రసాద్
అదనపు సమయం ఇవ్వాలంటే..
ఖర్చులు కింద రూ.10 వేలు చెల్లించాలని చైర్మన్ తరపు న్యాయవాదికి ఆదేశాలు
రేపు సాయంత్రం లోపు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని హైకోర్టు ఆదేశం
విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన హైకోర్టు
-
Sep 16, 2025 11:55 IST
శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద
జలాశయం 2 రేడియల్ క్రెస్టు గేట్లు 10 అడుగుల మేర ఎత్తిన అధికారులు.
ఇన్ ఫ్లో : 1,65,885 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 1,21,701 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 884.20 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 210.9946 టీఎంసీలు
కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
-
Sep 16, 2025 10:47 IST
ఉత్తరాఖండ్ సీఎం ధామికి ప్రధాని మోదీ, అమిత్‌షా ఫోన్
వరద పరిస్థితిని తెలుసుకున్న ప్రధాని మోదీ, అమిత్‌షా
సహాయక చర్యలు చురుగ్గా సాగుతున్నాయని చెప్పిన ధామి
కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని మోదీ హామీ
-
Sep 16, 2025 09:47 IST
నగరంలో పలుచోట్ల సోదాలు చేస్తున్న ఏసీబీ
ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఏడీఈ ఇంట్లో అధికారుల సోదాలు
మణికొండలో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ అనే వ్యక్తి
ఏడీ అంబేద్కర్ ఇల్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లల్లో కొనసాగుతున్న సోదాలు
మణికొండ, నార్సింగి డివిజన్లో ADగా పనిచేస్తున్న అంబేద్కర్
అక్రమస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు
భారీగా అగ్రికల్చర్, ప్లాట్స్, భవనాలను కొనుగోలు చేసినట్లు సమాచారం
కూడపెట్టిన ఆస్తులను బంధువులపై బినామీలుగా ఉంచిన అంబేద్కర్
అంబేద్కర్ అవినీతి ఆస్తుల చిట్టాను లెక్కపెడుతున్న ACB
హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో ఏసీబీ అధికారులు సోదాలు
15 టీమ్స్‌గా ఏసీబీ అధికారుల సోదాలు
-
Sep 16, 2025 09:35 IST
నేడు సుప్రీంకోర్టులో వివేకా హత్య కేసు విచారణ
గత విచారణ సందర్భంగా తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అన్నదానిపై అఫిడవిట్ దాఖలుకు సమయం కోరిన సీబీఐ
-
Sep 16, 2025 09:21 IST
నేడు మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ
నేడు ఎసీబీ కోర్టులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ.
లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి.
మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారించనున్న ఎసీబీ కోర్టు.
-
Sep 16, 2025 07:58 IST
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం..
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లే ప్రధాన అజెండగా జరగనున్న బోర్డు సమావేశం..
శ్రీవారి భక్తుల కోసం చేయాల్సిన ముందస్తు ఏర్పాట్ల పై చర్చ..
పలు కొనుగోళ్లు, ఇంజనీరింగ్ పనులకు ఆమోదం తెలపనున్న పాలకమండలి.