-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latest and Breaking news from AP Telangana and abroad on 13th september 2025 kjr
-
BREAKING: టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి: అంజన్‌కుమార్
ABN , First Publish Date - Sep 13 , 2025 | 07:16 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 13, 2025 18:56 IST
నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష
ఈనెల 23 నుంచి కృష్ణా ట్రైబ్యునల్ విచారణ దృష్ట్యా మంత్రి సమీక్ష
సమీక్షలో పాల్గొన్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్
తెలంగాణ జల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాం: ఉత్తమ్
811 టీఎంసీల కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 71 శాతం డిమాండ్ చేస్తున్నాం: ఉత్తమ్
న్యాయంగా రావాల్సిన నీటివాటాను సాధిస్తాం: ఉత్తమ్
ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపిస్తాం: మంత్రి ఉత్తమ్
తాగు, సాగునీటితో సహా పరిశ్రమల నీటి వినియోగానికి చర్యలు: ఉత్తమ్
ట్రైబ్యునల్ విచారణ సమయంలో సీఎం ఢిల్లీకి వచ్చి సమీక్షిస్తారు: ఉత్తమ్
-
Sep 13, 2025 18:56 IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నేను పోటీలో ఉన్నాను: మాజీ ఎంపీ అంజన్‌కుమార్
నా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి: అంజన్‌కుమార్ యాదవ్
నాకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి: అంజన్‌కుమార్ యాదవ్
ఉమ్మడి ఏపీ నుంచి యాదవ సామాజికవర్గానికి మంత్రి పదవి కేటాయించారు: అంజన్‌కుమార్ యాదవ్
నాకన్న సీనియర్లు ఎవరు లేరు...నాకు అన్ని అర్హతలు ఉన్నాయి: అంజన్‌కుమార్ యాదవ్
హైదరాబాద్ నుంచి ప్రాతినిథ్యం లేదు.. నాకు అవకాశం ఇవ్వాలి: అంజన్‌కుమార్
అనిల్‌కుమార్ యాదవ్‌కు యూత్ కాంగ్రెస్ కోటాలో ఎంపీ ఇచ్చారు: అంజన్ కుమార్
-
Sep 13, 2025 18:56 IST
వరంగల్ కాంగ్రెస్‌లో ముదురుతున్న మాటల యుద్ధం
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ విమర్శలపై స్పందించిన మంత్రి కొండా సురేఖ
నాయిని వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: కొండా సురేఖ
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ అదృష్టం కొద్ది గెలించారు: కొండా సురేఖ
నాయినిపై నేను కామెంట్ చేయాలని అనుకోవడం లేదు: కొండా సురేఖ
మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ లేదా?: మంత్రి కొండా సురేఖ
అధిష్టానం నుంచి వచ్చిన పేర్లను భర్తీ చేశా: కొండా సురేఖ
-
Sep 13, 2025 15:59 IST
ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. 14 జిల్లాలకు కొత్త బాస్‌లు..
ఎస్పీల బదిలీలపై కసరత్తు పూర్తి.
14 జిల్లాలకు కొత్త ఎస్పీలు.
7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు.
మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ.
12 జిల్లాల్లో ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగించిన ప్రభుత్వం.
కొత్త ఎస్పీలు వీరే..
1. బిఆర్ అంబేద్కర్ కోనసీమ - రాహుల్ మీనా
2. బాపట్ల- ఉమామహేశ్వర్
3. నెల్లూరు – అజితా వేజెండ్ల
4. తిరుపతి – సుబ్బారాయుడు
5. అన్నమయ్య – ధీరజ్ కునుగిలి.
6. కడప – నచికేత్
7. నంద్యాల్ – సునీల్ షెరాన్
పైన పేర్కొన్న ఈ ఏడు జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారుల నియామకం
9. విజయనగరం- ఎఆర్ దామోదర్
10. కృష్ణా – విద్యాసాగర్ నాయుడు
11. గుంటూరు – వకుల్ జిందాల్
12. పల్నాడు – డి కృష్ణారావు
13. ప్రకాశం– హర్షవర్థన్ రాజు
14. చిత్తూరు – తుషార్ డూడి
15. శ్రీ సత్యసాయి – సతీష్ కుమార్.
పైన పేర్కొన్న ఈ జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి అధికారులను బదిలీ చేశారు.
కాగా, శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల ఎస్పీలు యథాతథంగా ఉన్నారు.
-
Sep 13, 2025 15:16 IST
వైసీపీ కార్యకర్తకు కూడా మంత్రి లోకేష్ సాయం
ఆపదలో ఉన్నా.. CMRFతో సాయమందించాలంటూ పోస్ట్.
వైసీపీ కార్యకర్త పోస్ట్‌కు సానుకూలంగా స్పందించిన లోకేష్.
జగన్ ఫ్యాన్స్ క్యాంపెయిన్ పేరుతో నారా లోకేష్‌కు ట్వీట్.
CMRFతో కావాల్సిన సాయం తప్పక చేస్తానని లోకేష్ హామీ.
సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం.
-
Sep 13, 2025 15:00 IST
విజయనగరం: రాష్ట్రంలో వైసీపీ రౌడీయిజం చేస్తోంది: కేంద్రమంత్రి రామ్మోహన్
పెట్టుబడిదారులను భయపెట్టి అభివృద్ధిని అడ్డుకుంటోంది: రామ్మోహన్
ప్రభుత్వం అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంటే.. వైసీపీ అడ్డుపడుతోంది
నిర్మాణం పూర్తికాని మెడికల్ కాలేజీల కోసం మాత్రమే..
పీపీపీ మోడ్‌లో చేయడానికి ప్రయత్నిస్తున్నాం: కేంద్రమంత్రి రామ్మోహన్
-
Sep 13, 2025 14:11 IST
శంషాబాద్‌లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించిన హైడ్రా
12 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసి, ప్రభుత్వ భూమిగా హైడ్రా బోర్డు
ప్రభుత్వ భూమి విలువ రూ. 500 కోట్ల ఉంటుందన్న హైడ్రా
-
Sep 13, 2025 13:03 IST
జగన్.. చేతనైతే టెండర్లు తీసుకుని డెవలప్ చేయ్..: మంత్రి పెమ్మసాని
గుంటూరు, రాజధాని ప్రజలు తెలివైనవాళ్లు: కేంద్రమంత్రి పెమ్మసాని
ఎవరికి అధికారం ఇవ్వాలో రాజధాని ప్రజలకు తెలుసు.
మా హయాంలో మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయి.
జగన్ ఏదో కష్టపడి సాధించినట్టు మాట్లాడడం విడ్డూరం.
వైసీపీ హయాంలో ఎయిమ్స్‌కి రోడ్డు కూడా వేయలేదు.
జగన్‌కు చేతనైతే మెడికల్ కాలేజీ టెండర్లు తీసుకుని..ఆయనే అభివృద్ధి చేయాలి.
-
Sep 13, 2025 09:52 IST
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు
ఈ ఏడాదిలో 5వ సారి రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తివేత
జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
ఇన్ ఫ్లో : 2,26,192 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 1,49,104 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 883.90 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 209.1579 టీఎంసీలు
కుడి,ఎడమ విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
-
Sep 13, 2025 08:50 IST
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు లొంగుబాటు
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క లొంగుబాటు
మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా ఉన్న సుజాతక్క
గద్వాలకు చెందిన సుజాతక్క అలియాస్ పోతుల కల్పన
1984లో కిషన్‌జీని వివాహం చేసుకున్న సుజాతక్క
మొత్తం 106 కేసుల్లో నిందితురాలు సుజాతక్క
మధ్యాహ్నం 12 గంటలకు DGP ఎదుట లొంగుబాటు
-
Sep 13, 2025 08:36 IST
మూసీలో పెరిగిన వరద ఉదృతి
జంట జలాశయాల నుండి మూసీలోకి భారీగా నీటిని విడుదల చేసిన అధికారులు.
జంట జలాశయాల వరదతో ఉదృతంగా ప్రవహిస్తున్న మూసి.
ముసరాంబాగ్ బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తున్న మూసీ వరద.
ముసరాంబాగ్ బ్రిడ్జిపై నుండి రాకపోకలు నిలిపివేసిన పోలీసులు.
8200 క్యూసెక్యూల వరద ప్రవాహంతో ఉదృతంగా ప్రవహిస్తున్న మూసి.
బ్రిడ్జికి ఇరువైపులా భారీకేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని అనుమతించని అధికారులు..
గడిచిన నెల రోజుల్లో నాలుగో సారి బ్రిడ్జి పై నుండి ప్రవహిస్తున్న మూసి ప్రవాహం
-
Sep 13, 2025 07:19 IST
గ్రూప్-2 అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన
తెలంగాణలో గ్రూప్-2కు ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన
నేటి నుంచి ఈనెల 15 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్
నాంపల్లి తెలుగు వర్సిటీ ప్రాంగణంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్